కొలంబియా ముందుకు
దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌లో మేటి జట్లలో ఒకటైన కొలంబియా ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్‌కు చేరుకుంది. కాంగో బలమైన డిఫెన్స్‌ను ఛేదించి ముందంజ వేసింది.
- 1-0తో కాంగోపై గెలుపు
గ్వాడలహారా (మెక్సికో): దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌లో మేటి జట్లలో ఒకటైన కొలంబియా ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్‌కు చేరుకుంది. కాంగో బలమైన డిఫెన్స్‌ను ఛేదించి ముందంజ వేసింది. గ్రూప్-కెలో భాగంగా బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కొలంబియా 1-0తో కాంగోపై విజయం సాధించింది. 76వ నిమిషంలో డానియోల్ మునోజ్ ఏకైక గోల్‌తో తన జట్టును గెలిపించాడు. దాంతో మొత్తం 5 పాయింట్లతో గ్రూప్-కెలో అగ్రస్థానంలో నిలిచిన కొలంబియా రౌండ్-32 బెర్తు ఖాయం చేసుకుంది. పోర్చుగల్ నాలుగో పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. తమ తొలి మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్‌ను 1-1తో నిలువరించి 52 ఏండ్ల తర్వాత వరల్డ్‌కప్‌లో ఓ పాయింట్ దక్కించుకున్న 47వ ర్యాంకర్ కాంబో.. ఈ పోరులోనూ అద్భుతమైన డిఫెన్స్‌తో 11వ ర్యాంకర్ కొలంబియాను ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా ఆ టీమ్ గోల్ కీపర్ ఎంపసి.. కొలంబియాకు అడ్డు గోడలా నిలిచాడు. తొలి 20 నిమిషాల్లోనే ఐదు కష్టమైన సేవ్స్‌తో ఆకట్టుకున్నాడు. రోడ్రిగేజ్, జొహాన్ మంజికా, గుస్తవో పుయెర్టా కొట్టిన లాంగ్ రేంజ్ షాట్లతో పాటు.. కొలంబియా స్టార్ ఫార్వర్డ్ లూయిస్ దియాజ్, మునోజ్ క్లోజ్ షాట్లను కూడా అడ్డుకున్నాడు.
దాంతో ఫస్టాఫ్ 0-0తో ముగిసింది. బ్రేక్ తర్వాత కూడా కొలంబియా దాడులు కొనసాగించింది. 50వ నిమిషంలో దియాజ్ నెట్‌కు అతి దగ్గరి నుంచి కొట్టిన షాట్‌ను కూడా ఎంపసి సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేశాడు. చివరకు 76వ నిమిషంలో మునోజ్ ప్రత్యర్థి డిఫెన్స్‌ను బ్రేక్ చేశాడు. ఇన్సైడ్ ఏరియాలో ఓ డిఫెండర్‌ను తాకి డిఫ్లెక్ట్ అయిన బంతిని మునోజ్ ఎడమ కాలితో కొట్టిన షాట్‌ను ఎంపసి ఆపలేకపోవడంతో కొలంబియా 1-0తో ముందంజ వేసింది. మునోజ్‌కు టోర్నీలో ఇది రెండో గోల్ కావడం విశేషం. ఆపై, లూయిస్ దియాజ్ 79, 80 నిమిషాల్లో రెండు గోల్స్ చేసినా.. ఒకటి ఫౌల్ కాగా, మరోదాన్ని రిఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించాడు. మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో కాంబో స్కోరు సమం చేసేందుకు రెండుసార్లు చేరువగా వచ్చింది. ఆ జట్టు ఆటగాడు ఎంబుకు లాంగ్ రేంజ్ షాట్‌తో పాటు, కార్నర్ కిక్కు ఎంబెబా కొట్టిన హెడ్డర్‌ను కొలంబియా గోల్ కీపర్ కమిలో వర్గాస్ అద్భుతంగా సేవ్ చేసి జట్టుకు విజయం అందించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

