Prraneeth Vuppala | ఆరేండ్ల వయసులోనే ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తుచేసిన ఆ బుడతడు.. పదహారేండ్లు వచ్చేసరికి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. అదిరిపోయే ఆటతో.. 64 గళ్ల ఆటలో ఆరితేరిన ఉప్పల ప్రణీత్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు.
సూపర్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోవడంతో పాటు.. ప్రపంచ చాంపియన్‌గా నిలువడమే తన ప్రధాన లక్ష్యమంటున్న ప్రణీత్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.
పిన్న వయసులోనే చదరంగంలో చెరగని ముద్ర వేస్తూ.. అంచలంచెలుగా ఎదిగి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ఉప్పల ప్రణీత్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో 2500 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించిన ప్రణీత్.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ర్టానికి గొప్ప పేరు తీసుకొచ్చిన ప్రణీత్.. సూపర్ గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. భవిష్యత్తు ఖర్చుల కోసం ప్రణీత్‌కు రెండున్నర కోట్ల నగదు ప్రోత్సాహకం అందిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. నిలకడైన ఆటతీరుతో ప్రణీత్ ప్రపంచ చాంపియన్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ‘ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్'(డబ్ల్యూసీఎమ్)గా గుర్తింపు పొందిన వీర్లపల్లి నందిత (19)ను సీఎం అభినందించారు. శిక్షణ ఇతర ఖర్చుల కోసం నందితకు రూ. 50 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
పట్టు వదలని సంకల్పంతో పదహారేండ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ఉప్పల ప్రణీత్‌కు ముఖ్యమంత్రి భారీ నజరానాప్రకటించారు. సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగేందుకు రూ. 2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ వీర్లపల్లి నందితకు రూ.50 లక్షల నగదు ప్రోత్సాహకం అందించాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పిన్న వయసులోనే చదరంగంలో చెరగని ముద్ర వేస్తూ.. గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ఉప్పల ప్రణీత్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో 2500 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించిన ప్రణీత్.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వరల్డ్ చెస్ ఫెడరేషన్.. గ్రాండ్‌మాస్టర్ హోదా ప్రకటించిన నేపథ్యంలో ప్రణీత్ కుటుంబ సభ్యులతో పాటు సోమవారం సెక్రటేరియేట్‌లో ముఖ్యమంత్రిని కలిశాడు. స్వరాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో అండర్-7 స్టేట్ చాంపియన్‌గా నిలిచిన తనను ముఖ్యమంత్రి అభినందించిన విషయం ప్రణీత్ గుర్తుచేశాడు. దీంతో భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించి ప్రపంచ చాంపియన్‌గా ఎదగాలని సీఎం దీవించారు.
ఇదే నిదర్శనం: శ్రీనివాస్ గౌడ్
చెస్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ.. గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ఉప్పల ప్రణీత్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ర్టానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రణీత్‌కు రూ. 2.5 కోట్లు నగదు ప్రోత్సాహకం ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ.. వరల్డ్ చెస్ ఫెడరేషన్ ద్వారా ‘ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్'(డబ్ల్యూసీఎమ్)గా గుర్తింపు పొందిన వీర్లపల్లి నందిత (19)ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నందిత అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ.50 లక్షల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించారు.