ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన యూనివర్స్ బాస్ క్రిస్‌గేల్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విండీస్ హార్డ్‌హిట్టర్ క్రిస్‌గేల్ చరిత్ర సృష్టించాడు.
మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గేల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్
జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్..ఐపీఎల్లో 350 సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో సిక్స్ బాది ఈ ఫీట్ అందుకున్నాడు.
మరే ఇతర బ్యాట్స్‌మన్ కనీసం 250 మార్క్ కూడా చేరుకోలేదు. సౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ 237 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడిన గేల్ 351 సిక్స్ బాదాడు. ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచిన క్రిస్ గేల్ రికార్డును భవిష్యత్‌లో ఏ బ్యాట్స్‌మన్ బ్రేక్ చేస్తాడో! రాయల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన తొలి పోరులో పంజాబ్ కింగ్స్ అదిరే బోణీ చేసింది.
Milestone 🚨 – 3⃣5⃣0⃣ Maximums in the IPL for the Universe Boss 💥💥#VIVOIPL | #RRvPBKS | @henrygayle pic.twitter.com/bhIxAAmq2J
— IndianPremierLeague (@IPL) April 12, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Chris Gayle
- ipl
- IPL 2021
- RR vs PBKS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

