Chris Cairns: గుండెకు సర్జరీ చేస్తుంటే స్ట్రోక్.. క్రిస్ కెయిన్స్ కాళ్లకు పక్షవాతం
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రపంచ మేటి ఆల్రౌండ్లలో ఒకడైన క్రిస్ కెయిన్స్( Chris Cairns ) ఆ మధ్య గుండె సంబంధిత జబ్బుతో హాస్పిటల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలు

సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రపంచ మేటి ఆల్రౌండ్లలో ఒకడైన క్రిస్ కెయిన్స్( Chris Cairns ) ఆ మధ్య గుండె సంబంధిత జబ్బుతో హాస్పిటల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలుసు కదా. తాజాగా అతనికి గుండె ఆపరేషన్ చేస్తున్న సమయంలో స్ట్రోక్ వచ్చిందని, దీంతో కెయిన్స్ కాళ్లకు పక్షవాతం వచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నెల మొదట్లో అతన్ని క్యాన్బెరాలోని హాస్పిటల్లో అడ్మిట్ చేయగా.. సర్జరీ కోసం సిడ్నీకి తరలించారు. అక్కడ అత్యవసరంగా సర్జరీ నిర్వహించినా.. ఇప్పుడు కాళ్లకు పక్షవాతం రావడంతో కెయిన్స్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు.
కాళ్లు చచ్చుబడిపోవడంతో ఆస్ట్రేలియాలోనే మరో స్పెషలిస్ట్ హాస్పిటల్లో కెయిన్స్‌కు రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. సిడ్నీలో సర్జరీ తర్వాత కెయిన్స్‌ను కుటుంబ సభ్యులు మళ్లీ క్యాన్‌బెరాకు తీసుకొచ్చారు. ఈ కష్ట సమయంలో కెయిన్స్ కోలుకోవాలని ప్రార్థిస్తున్న అందరికీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. న్యూజిలాండ్ తరఫున కెయిన్స్ 1989 నుంచి 2004 మధ్య 62 టెస్టులు ఆడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Syndar c | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
US Midterm Elections | ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాభవం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

