ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్.. పక్షవాతానికి గురైన క్రికెటర్ వీడియో మెసేజ్

సిడ్నీ: ఒకప్పుడు క్రికెట్లోని గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్స్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. కానీ ఇప్పుడు పక్షవాతంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. అయినా తన ప్రాణాలు కాపాడినందుకు డాక్టర్లకు, తన కోసం ప్రార్థించిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నాడు న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్. అయితే రానున్న కాలంలో తన జీవితంలోనే అతి పెద్ద సవాలును ఎదుర్కోబోతున్నట్లు అతడు చెప్పాడు. మేజర్ సర్జరీ తర్వాత అతడు తొలిసారి ఓ వీడియో సందేశాన్ని సోమవారం రిలీజ్ చేశాడు. గుండె నాళాల్లో చీలిక ఏర్పడటంతో సిడ్నీలోని డాక్టర్లు అతనికి సర్జరీ నిర్వహించారు. అయితే ఈ సర్జరీ సందర్భంగా స్ట్రోక్ రావడంతో కెయిన్స్ పక్షవాతానికి గురయ్యాడు. ప్రస్తుతం అతనిది నడవలేని పరిస్థితి.
దీంతో చక్రాల కుర్చీలో కూర్చునే అతడు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. తన ప్రాణాలు కాపాడిన వైద్య సిబ్బందికి థ్యాంక్స్ చెబుతూనే.. తన జీవితంలో అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతున్నట్లు కెయిన్స్ చెప్పాడు. ఈ నెలన్నర కాలంలో తనకు పలు సర్జరీలు జరిగాయని, వైద్యులు తన గుండెను కాపాడారని అతనన్నాడు. అయితే ఈ ప్రక్రియలోనే స్ట్రోక్ వచ్చిందని, రీహ్యాబిలిటేషన్ కోసం వెళ్తున్న తాను అతి పెద్ద సవాలును ఎదుర్కోబోతున్నట్లు చెప్పాడు. న్యూజిలాండ్ తరఫున 1989 నుంచి 2004 మధ్య ఆడిన కెయిన్స్ 62 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు.
It’s been a big 6 wks. On 4th August I suffered a Type A aortic dissection, a rare but serious condition. I required emergency surgery and from there a range of complications ensued and I ended up suffering a spinal stroke. A long road ahead, but I’m grateful to be here. ❤️ pic.twitter.com/ylRoz2HmPF
— Chris Cairns (@chriscairns168) September 19, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Syndar c | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
US Midterm Elections | ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాభవం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

