BBL 2026 | చెన్నై సూపర్ కింగ్స్ గడ్డపై బిగ్‌బాష్ లీగ్.. డిసెంబర్లో ఆరంభ పోరు..!
BBL 2026 : క్రికెట్‌ను ఎంతో ప్రేమించే భారత్‌లో మరో మరో టీ20 లీగ్ మ్యాచ్ అభిమానులను అలరించనుంది. మన ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్‌బాష్ లీగ్(BBL)ను తొలిసారి భారత గడ్డపై నిర్వహించనున్నారు.
BBL 2026 : క్రికెట్‌ను ఎంతో ప్రేమించే భారత్‌లో మరో మరో టీ20 లీగ్ మ్యాచ్ అభిమానులను అలరించనుంది. మన ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్‌బాష్ లీగ్(BBL)ను తొలిసారి భారత గడ్డపై నిర్వహించనున్నారు. డిసెంబర్ 12న ఆరంభ పోరుకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోడీ, ఆంటోనీ అల్బనీస్‌ల భేటీ అనంతరం చెన్నైలో బీబీఎల్ మ్యాచ్‌పై స్పష్టత వచ్చింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా కొన్ని కార్యక్రమాల మార్పిడి ఒప్పందం కొనసాగుతోంది. ఈక్రమంలోనే క్రికెట్‌కు విశేషమైన ఆదరణ కలిగిన ఇండియాలో బీబీఎల్ మ్యాచ్ నిర్వహణకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తి చూపింది. అందుకు.. బీసీసీఐ (BCCI), తమిళనాడు క్రికెట్ సంఘం (TNCA) సైతం అంగీకారం తెలపడంతో ఆరంభ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. డిసెంబర్ 12న తొలిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ పెర్త్ స్కాచర్స్, మెల్బోర్న్ రెనెగ్రేడ్స్ తలపడనున్నాయి.
It’s official! Perth Scorchers and Melbourne Renegades will open BBL 16 in Chennai on December 12. @andymcg_cricket reports from the MCG 📍 pic.twitter.com/6GRUPHsJw8
— Cricinfo (@cricinfo) July 10, 2026
‘భారత్‌లో బీబీఎల్ నిర్వహించడం సరైంది అనిపించకపోవచ్చు. క్రికెట్‌కు విశేషమైన ఆదరణ ఉన్న ఇండియాలో ఆడడం ఎవరికైనా ఇష్టమే. ఐపీఎల్‌కు ఆసీస్‌లో ఎంతో క్రేజ్ ఉంది. అలానే.. బీబీఎల్‌కు మరింత గుర్తింపు తేవడం కోసం ఆరంభ పోరును చెన్నైలో నిర్వహిస్తున్నాం’ అని బీబీఎల్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డాబ్సన్ (Alistair Dobson) పేర్కొన్నాడు.
‘మే’లో పరిశీలన..
బీబీఎల్‌కు మరింత క్రేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో భారత్‌లో మ్యాచ్ జరపాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. అందుకు టీ20లను అమితంగా ఇష్టపడే చెన్నైని వేదికగా ఎంచుకున్న సీఏ.. చెన్నైలో వసతులు, పరిస్థితుల్ని స్వయంగా చూసి తెలుసుకునేందుకు మే నెలలో తమ బృందాన్ని పంపింది. బీబీఎల్ బృందం, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం చిదంబరం స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ, ప్రేక్షకుల ఆదరణ వంటి విషయాలను పరిశీలించింది. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మిన్హస్, తాత్కాలిక సీఈఓ హేమంగ్ అమిన్ హాజరై పరిస్థితులను వివరించారు.
India’s sporting future takes centre stage 🇮🇳
Prime Minister Shri Narendra Modi highlighted India’s long-term sporting vision and expressed his delight over the Big Bash League’s opening fixture being played in Chennai.#BBL16 pic.twitter.com/ew4CDfVm5f
— Star Sports (@StarSportsIndia) July 10, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

