Team India: వరల్డ్ కప్ ముగిసింది.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి..?
Team India: టీమిండియా తర్వాతి షెడ్యూల్ ఎలా ఉంది..? మరో నాలుగు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతి సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఆ లోపు టీమిండియా షెడ్యూల్ ఎలా ఉండనుందో ఇక్కడ చూద్దాం.
Team India: స్వదేశంలో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో కప్పు సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగి తుది మెట్టు మీద బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. ఈ మెగా టోర్నీ తర్వాత ఏం చేయనుంది..? టీమిండియా తర్వాతి షెడ్యూల్ ఎలా ఉంది..? మరో నాలుగు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతి సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఆ లోపు టీమిండియా షెడ్యూల్ ఎలా ఉండనుందో ఇక్కడ చూద్దాం.
వరల్డ్ కప్ ఓటమిలో ఉన్న భారత అభిమానులకు మరో మూడు రోజులలోనే క్రికెట్ మజా దక్కనుంది. ఈనెల 23 నుంచి డిసెంబర్ 03 వరకూ ఇండియా-ఆసీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఆ తర్వాత భారత్.. డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. సుమారు నెల రోజుల పాటు జరుగబోయే ఈ టూర్లో భారత్.. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం అఫ్గానిస్తాన్.. భారత పర్యటనలో మూడు టీ20లు ఆడాల్సి ఉంది. జనవరి – మార్చి దాకా భారత్ – ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత మార్చి మాసాంతం నుంచి ఐపీఎల్ మొదలవుతుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగనుంది.
ఇండియా షెడ్యూల్
- నవంబర్ 23 నుంచి డిసెంబర్ 08 వరకూ ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్
- డిసెంబర్ 10 నుంచి 2024 జనవరి 07 దాకా భారత్.. సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది.
- జనవరి 11 నుంచి 17 వరకూ అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్
- జనవరి 25 నుంచి మార్చి 11 దాకా ఇండియా – ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్
- మార్చి – ఏప్రిల్ – మే లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్
- 2024 జూన్‌లో టీ20 వరల్డ్ కప్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

