IPL 2021: కోల్‌కతా ఢమాల్.. 31 పరుగులకే 5 వికెట్లు

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ మరోసారి చేతులెత్తేశారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ దారుణ ప్రదర్శనతో నిరాశపరిచారు. చెన్నై పేసర్ దీపక్ చాహర్ దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు వేసిన చాహర్ 4 వికెట్లు తీసి 16 పరుగులే ఇచ్చాడు. వైవిధ్యమైన బంతులు వేసి కోల్‌కతా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. చాహర్‌తో పాటు ఆరో ఓవర్లో లుంగి ఎంగిడి ఒక వికెట్ తీయడంతో పవర్‌ప్లే ఆఖరికి కోల్‌కతా 45/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఐదుగురు బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నితీశ్ రాణా(9), శుభ్‌మన్ గిల్(0), రాహుల్ త్రిపాఠి(8), ఇయాన్ మోర్గాన్(7), సునీల్ నరైన్(4) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ప్రస్తుతం దినేశ్ కార్తీక్(16), ఆండ్రీ రస్సెల్(6) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK
- IPL 2021
- KKR
- KKR vs CSK
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

