ఇది అవుటా.. సిక్సా.. వీడియో చూసి మీరే చెప్పండి

లండన్: క్రికెట్లో చాలా వింతలు జరుగుతుంటాయి. దశాబ్దాల నుంచి క్రికెట్ ఫాలో అవుతున్న వారికి కూడా కొన్నిసార్లు ఆ వింతను అర్థం చేసుకోవడం, క్రికెట్ రూల్స్ తెలుసుకోవడం కష్టమవుతుంది. అలాంటిదే ఇది కూడా. కెంట్, సోమర్సెట్ మధ్య వైటాలిటీ బ్లాస్ట్ టీ20 ఫైనల్లో జరిగిందిది. ఒక్కసారి కింద ఉన్న వీడియో చూడండి. సోమర్సెట్ బ్యాట్స్‌మన్ విల్ స్మీడ్ ఓ భారీ షాట్ కొట్టాడు. అయితే దానిని బౌండరీ దగ్గర జోర్డాన్ కాక్స్ క్యాచ్ అందుకున్నాడు. బ్యాట్స్‌మన్ అవుటయ్యానని నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఆశ్చర్యపరిచింది. అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయడం, అది అసలు అవుట్ కాదు.. సిక్స్ అని తేల్చడం జరిగిపోయాయి.
ఏం జరిగింది?
కాక్స్ క్యాచ్ అందుకుంటున్న సమయంలోనే అటు వైపు నుంచి మరో ఫీల్డర్ డేనియల్ బెల్ కూడా అందుకోవడానికి వచ్చాడు. ఈ క్రమంలో అతడు డైవ్ చేశాడు. అప్పటికే కాక్స్ క్యాచ్ అందుకున్నా.. డైవ్ చేసే క్రమంలో డేనియల్ బెల్ నియంత్రణ కోల్పోయి బౌండరీ లైన్‌కు తాకాడు. అదే సమయంలో ఇటు కాక్స్ కూడా బెల్ నుంచి తప్పించుకోబోయి అతన్ని తాకాడు. అన్ని కోణాల్లో రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ చివరికి దీనిని సిక్స్‌గా ప్రకటించాడు. క్యాచ్ పట్టుకున్న ఫీల్డర్ నేరుగా బౌండరీ లైన్‌ను తాకకున్నా.. ఆ లైన్‌ను తాకిన మరో ఫీల్డర్‌ను టచ్ చేయడం కొంప ముంచింది.
క్రికెట్ రూల్ ఏం చెబుతోంది?
అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఇది సిక్స్ ఎలా అవుతుంది? ఎందుకు అవుటివ్వలేదు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు క్రికెట్ రూల్ ఏం చెబుతోందో చూద్దాం. ఎంసీసీలోని చట్టం 19.5.1 ప్రకారం.. ఓ ఫీల్డర్ గ్రౌండ్ లోపలే ఉన్నా.. అతని శరీరంలోని ఓ భాగం బౌండరీ లైన్ బయట ఉన్న ఫీల్డర్‌కు తగిలినప్పుడు, ఇద్దరు ఫీల్డర్స్‌లో ఎవరో ఒకరు కావాలని ఫీల్డింగ్‌లో సాయం చేసే ఉద్దేశంతో ఉన్నాడని అంపైర్ భావిస్తే దానిని నాటౌట్ ప్రకటించవచ్చు. అంటే ఈ విషయంలో అంపైర్ విచక్షణే ముఖ్యం. తాజా మ్యాచ్‌లోనూ మూడో అంపైర్ అన్ని కోణాల్లో రీప్లేలు చూసిన తర్వాత చివరికి బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించాడు.
Out or not? 🤔#Blast21 #FinalsDay pic.twitter.com/J8luyZMV6o
— Vitality T20 Blast (@VitalityBlast) September 18, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

