Carlos Alcaraz | అల్కరాజ్ ఖాతాలో తొలి గ్రాస్ కోర్టు టైటిల్.. జకోవిచ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి
Carlos Alcaraz : టెన్నిస్‌లో నయా సంచలనంగా పేరొందిన కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) మరో టైటిల్ సాధించాడు. క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్(Queen’s Club Championship) ఫైనల్లో గెలిచి తొలి గ్రాస్ కోర్టు టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో అతడికి ఇది ఐదో ఏటీపీ టైటిల్. టైటిల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డీ మినౌర్(Alex de Minaur)ను ఈ స్పెయిన్ స్టార్....
Carlos Alcaraz : టెన్నిస్‌లో నయా సంచలనంగా పేరొందిన కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) మరో టైటిల్ సాధించాడు. క్వీన్స్ క్లబ్ చాంపియన్‌షిప్(Queen’s Club Championship) ఫైనల్లో గెలిచి తొలి గ్రాస్ కోర్టు టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్లో అతడికి ఇది ఐదో ఏటీపీ టైటిల్. టైటిల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డీ మినౌర్(Alex de Minaur)ను ఈ స్పెయిన్ స్టార్ ఓడించాడు. ఈ విజయంతో మళ్లీ వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంత చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో ఓటమితో అతను రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే.
ఉత్కంఠ రేపిన ఫైనల్లో అల్కరాజ్, అలెక్స్ డీ మినౌర్ గంట 39 నిమిషాల పాటు తలపడ్డారు. చివరకు ఎక్కువ బ్రేక్ పాయింట్లు సాధించిన అల్కరాజ్ 6-4, 6-4 మినౌర్ను చిత్తు చేశాడు. ఐదో ఏటీపీ టైటిల్‌తో అల్కరాజ్ రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్(Daniil Medvedev) రికార్డును సమం చేశాడు.
🏆 𝐊𝐈𝐍𝐆 𝐂𝐀𝐑𝐋𝐈𝐓𝐎𝐒 🏆@carlosalcaraz | #cinchChampionships pic.twitter.com/FdFmmnuMLS
— ATP Tour (@atptour) June 25, 2023
నంబర్ 1 గా వింబుల్డన్‌కు
క్వీన్స్ క్లబ్ ఫైనల్ ఫైట్‌కు ముందు అల్కరాజ్ నంబర్ 1 స్థానం గురించి మాట్లాడాడు. ‘టాప్ సీడ్ కోసం నేను పెద్దగా ఆలోచించడం లేదు. అయితే.. జకోవిచ్‌తో పోటీపడడం నాకు చాలా ఉపయోగపడుతోంది. ఇది ఒకరకంగా నాకు అదనపు మోటివేషన్. నంబర్ 1 స్థానం కోసం నాకు, జకోవిచ్ మధ్య అందమైన పోటీ జరుగుతోందని అనుకుంటున్నా. అయితే.. నంబర్ 1 ఆటగాడిగా వింబుల్డన్(Wimbledon) టోర్నమెంట్లో బరిలోకి దిగాలనేది నా కల’ అని ఈ స్పెయిన్ స్టార్ తెలిపాడు. అనుకున్నట్టుగానే ఇప్పుడు మళ్లీ టాప్ సీడ్‌గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి
Ravi Shastri | వరల్డ్ కప్‌లో భారత్ సహా ఫేవరెట్ జట్లు అవే : రవి శాస్త్రి
MS Dhoni | విమానంలో క్యాండీ క్రష్ ఆడిన ధోనీ.. చాక్లెట్లు ఆఫర్ చేసిన ఎయిర్‌హోస్టెస్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

