పారిస్ : 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ను అధిగమించి మళ్లీ టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలుచుకుని జొకోవిచ్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
అల్కారజ్, డేనియల్ మెద్వెదెవ్, కాస్పర్ రూడ్, స్టెఫనాస్ సిసిపాస్ వరుసగా తొలి అయిదు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తోపాటు టాప్ ర్యాంక్‌నూ నిలబెట్టుకుంది. అరినా సబలెంక, ఎలెనా రిబకినా, కరోలిన్ గార్సియా, జెస్సికా పెగ్యులా వరుసగా తరువాతి నాలుగు స్థానాలను దక్కించుకున్నారు.