మియామీ: ఈ యేటి ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆఫ్రికా దేశం కేప్ వెర్డే .. గ్రూపు దశలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ రౌండ్32 మ్యాచ్‌లోనూ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాకు చుక్కలు చూపించింది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ఈ మ్యాచ్ గెలిచేందుకు తీవ్రంగా కష్టపడింది. కేప్ వెర్డే ఈ మ్యాచ్‌లో విరోచిత పోరాటం చేసింది. ఎక్స్ట్రా టైంలో ఆ దేశ ప్లేయర్ సిడ్నీ లోప్స్ కాబ్రల్ ( Sidny Lopes Cabral)స్టన్నింగ్ గోల్ కొట్టి .. అర్జెంటీనా ప్లేయర్లకు ఊహించని షాక్ ఇచ్చాడు. తొలుత నిర్ణీత 90 నిమిషాల వరకు రెండు జట్లు 1-1 గోల్స్ తో సమంగా నిలిచాయి.
అయితే ఎక్స్ట్రా టైంలో ముందు అర్జెంటీనా ఓ గోల్ చేసి 2-1 ఆధిక్యాన్ని సాధించింది. కానీ అర్జెంటీనా ఆశలపై కాబ్రల్ నీళ్లు చల్లాడు. కళ్లు చెదిరే రీతిలో అతను కార్నర్ గోల్ కొట్టాడు. దీన్ని గోల్ ఆఫ్ టోర్నమెంట్‌గా నిపుణులు భావిస్తున్నారు. బాక్సు ఎడ్జ్ నుంచి కొట్టిన ఆ షాట్‌కు బంతి కర్వ్ తీసుకుని టాప్ కార్నర్ దిశగా గోల్ పోస్టులోకి వెళ్లింది. ఊహించని రీతిలో కాబ్రల్ గోల్ చేయడంతో మెస్సీ బృందం ఖంగుతిన్నది.
టాప్ కార్నర్ గోల్‌తో ఒక్కసారిగా అర్జెంటీనాకు కాబ్రల్ షాకిచ్చాడు. అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ గోల్ అన్న అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. పసికూనగా ఎంట్రీ ఇచ్చిన కేప్ వెర్డే.. ఎవరూ అంచనా వేయని రీతిలో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టింది. కానీ రౌండ్32 మ్యాచ్‌లో చివరి నిమిషంలో అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
What has Sidny Lopes Cabral just done?
That’s not one of the best goals of the tournament. That’s one of the best goals in the history of the World Cup. pic.twitter.com/diEVXuIpas— 💤 (@hys_j4) July 4, 2026