Dilpreet Bajwa: కెనడా కెప్టెన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ఐసీసీ నజర్లో దిల్‌ప్రీత్ బజ్వా
Dilpreet Bajwa: కెనడా కెప్టెన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దిల్‌ప్రీత్ బజ్వాపై ప్రస్తుతం ఐసీసీ దర్యాప్తు చేపడుతున్నది. పంజాబీ మూలాలు ఉన్న దిల్‌ప్రీత్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో కెనడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ముంబై : ఇటీవల వరల్డ్‌కప్‌లో ఆడిన కెనడా జట్టు టీ20 కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా(Dilpreet Bajwa)పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలికి చెందిన అవినీతి నిరోధక యూనిట్ ఆ ఆరోపణలపై దర్యాప్తు చేపడుతున్నది. టీ20 వరల్డ్‌కప్ సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్‌ప్రీత్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్‌లోని బాటాలాలో జన్మించాడు దిల్‌ప్రీత్. అతని వయసు 24 ఏళ్లు. వరల్డ్‌కప్‌లో అతని ఆటతీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కెనడా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ఏసీయూ దర్యాప్తు చేపడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఆ మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్ 174 రన్స్ చేజింగ్ చేస్తున్న సమయంలో 35-2 స్కోరు వద్ద అకస్మాత్తుగా దిల్‌ప్రీత్ బజ్వా బౌలింగ్ చేశాడు. అతను తన తొలి ఓవర్లో నోబ్లు, వైడ్లు వేశాడు. మొత్తం 15 రన్స్ ఇచ్చాడు. కానీ అనూహ్యంగా అతను బౌలింగ్ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మ్యాచ్ కీలక దశలో ఉన్నప్పుడు బజ్వా బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఏసీయూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన బౌలర్లు.. కావాలని నోబ్ లేదా వైడ్ వేసే అవకాశాలు ఉంటాయి. ఆ కోణంలో బజ్వాపై విచారణ జరగనున్నది.
ఇటీవల కెనడా టీవీలో ఓ డాక్యుమెంటరీ ప్రసారమైంది. కరప్షన్, క్రైం, క్రికెట్ అన్న టైటిల్‌తో ఆ డాక్యుమెంటరీ ప్రజెంట్ చేశారు. టీం సెలెక్షన్‌తో పాటు బజ్వాను కెప్టెన్‌గా ఎంపిక చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా ఓటమి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో బెట్టింగ్ లాంటి ఆరోపణలను కూడా ఏసీయూ దర్యాప్తు చేయనున్నది. ఫోన్, కమ్యూనికేషన్ రికార్డులను పరిశీలిస్తారు. ప్రస్తుతం ఆ క్రికెటర్‌పై ఎటువంటి అభియోగాలు నమోదు కాలేదు. కానీ అతని వ్యవహార శైలిపై అనుమానాలు రావడంతో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిసింది.
పంజాబ్ దేశవాళీ క్రికెట్లో చోటు దక్కకపోవడంతో గురుదాస్‌పూర్‌కు చెందిన దిల్‌ప్రీత్ బజ్వా 2020లో కెనడా వెళ్లాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో అతను పేరు సంపాదించుకున్నాడు. మాంట్రియల్ టైగర్స్ తరపున ఆడిన అతను ఓ సెంచరీ కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. 2026లో కెనడా జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి సిక్కుగా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే కెనడా ఇంటెలిజెన్స్ ప్రకారం క్రికెట్ బెట్టింగ్, ఫిక్సింగ్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కెనడాలోని సర్రే, బ్రిటీష్ కొలంబియా జట్ల ఆటగాళ్లను బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించినట్లు తెలుస్తోంది.
కావాలని నోబ్, వైడ్ వేసినట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం బజ్వాను ఐసీసీ విచారిస్తున్నది. అతని ఫోన్‌ను సీజ్ చేసింది. డెల్టా, బీసీ, ఆర్సీఎంపీ రాష్ట్రాలకు చెందిన కెనడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బెదిరింపులు, కాల్పుల ఘటనలకు లింకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కెనడా పోలీసులు, కెనడా క్రికెట్ ప్రకారం మాత్రం బజ్వాపై ఇంకా ఎటువంటి నేరం రుజువుకాలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

