Iftikhar Ahmed: ఇఫ్తికర్ అహ్మాద్ ఎవరితో మాట్లాడుతున్నాడో.. వైరల్ అవుతున్న వీడియో
Iftikhar Ahmed: పాకిస్థాన్ క్రికెటర్ ఇఫ్తికర్ అహ్మాద్‌కు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇఫ్తికర్ మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ వీడియోలో మాత్రం అక్కడ ఎవరూ ఉండరు.
ముంబై: పాకిస్థాన్ క్రికెటర్ ఇఫ్తికర్ అహ్మాద్(Iftikhar Ahmed)కు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇఫ్తికర్ మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ వీడియోలో మాత్రం అక్కడ ఎవరూ ఉండరు. ఈ ఘటనకు చెందిన వీడియోపై క్రికెట్ ప్రేమికులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఇఫ్తికర్ ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పండి అంటూ కొందరు క్రికెట్ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ వీడియో మాత్రం ఓ రహస్యంగా ఉంది.
ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో ఇఫ్తికర్ కేవలం 27 బంతుల్లో 40 రన్స్ చేశాడు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో తమ స్పిన్నర్లు సరిగా రాణించలేదన్నాడు. తనతో పాటు నవాజ్ కూడా పెద్దగా ఆకర్షించలేకపోయినట్లు చెప్పాడు. కానీ తాము ఇంప్రూవ్ కావడానికి ట్రై చేయనున్నట్లు చెప్పాడు. ప్రస్తుత టోర్నమెంట్లో పాక్ ఫీల్డిండ్ కూడా పేలవంగా ఉంది. ఫీల్డింగ్ సమయంలో చాలా పొరపాట్లు జరుగుతున్నట్లు చెప్పాడు.
పాకిస్థాన్ సెమీస్‌కు క్వాలిఫై కావాలంటే, తప్పకుండా మిగితా మ్యాచ్‌లను ఆ జట్టు గెలవాల్సిందే. అయితే తాము మళ్లీ గాడిలోపడుతామని ఇఫ్తికర్ తెలిపాడు. తమ వద్ద అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని, మిగితా అన్నీ మ్యాచ్‌లను గెలిచేస్తామని పేర్కొన్నాడు.
Can anyone decode why Iftikhar talking to himself?? pic.twitter.com/s403tYWTh0
— 24 (@Chilled_Yogi) October 24, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

