సిడ్నీ: బిగ్ బ్యాష్ లీగ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ కెమరూన్ బాయ్స్ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఆ లీగ్‌లో డబుల్ హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా నిలిచాడు. మెల్బోర్న్ రెనిగేడ్స్ తరపున ఆడుతున్న ఆసీస్ మాజీ స్పిన్నర్ కెమరూన్.. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీస్తే, దాన్ని డబుల్ హ్యాట్రిక్ అంటారు. క్రికెట్లో హ్యాట్రిక్ కామన్. కానీ డబుల్ హ్యాట్రిక్ చాలా అరుదు. గత ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంప్యర్ ఇలా 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్లో డబుల్ హ్యాట్రిక్ తీసిన ప్లేయర్లలో క్యాంపర్ మూడవ ప్లేయర్. గతంలో లసిత్ మలింగ పేరిట కూడా డబుల్ హ్యాట్రిక్ రికార్డు ఉంది. ఇవాళ జరిగిన బీబీఎల్ మ్యాచ్‌లో కెమరూన్ మొత్తం 5 వికెట్లు తీశాడు. అయినా కానీ ఆ మ్యాచ్‌లో సిడ్నీ చేతిలో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. అలెక్స్ హేల్స్, జేసన్ సంఘా, అలెక్స్ రాస్, డేనియల్ సామ్స్‌ను కెమరూన్ ఔట్ చేశాడు.