Viral: గల్లీ క్రికెట్లో బ్యాటింగ్ చేసే జట్టులో ఎవరైనా ఔట్ కాకున్నా ఔట్ ఇస్తేనో లేక ఇతరత్రా కారణాల వల్ల గొడవ జరిగితేనో సదరు ఆటగాళ్లు ‘మీరు తొండి ఆట ఆడుతుర్రు. మేం ఈ మ్యాచ్ ఆడం పో’ అని అక్కడ్నుంచి వెళ్లిపోవడం మనకు తెలిసిందే. అచ్చంగా ఇలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా జరిగింది. కంబోడియా-ఇండోనేషియా మధ్య జరిగిన ఓ టీ20 మ్యాచ్ ఇందుకు వేదికైంది. తమ జట్టులోని ఓ ఆటగాడిని అన్యాయంగా ఔట్ ఇచ్చారని ఆరోపిస్తూ కంబోడియా మ్యాచ్ మధ్యలోనే వాకౌట్ చేసింది.
వివరాల్లోకెళ్తే.. కంబోడియ – ఇండోనేషియా మధ్య బాలి వేదికగా జరిగిన ఆరో టీ20 మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన కంబోడియా.. 11.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. అయితే దానేశ్ శెట్టి వేసిన ఆ ఓవర్ మూడో బంతికి కంబోడియా బ్యాటర్ లుక్మన్ బట్.. వికెట్ కీపర్ ధర్మ కెసుమాకు క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ దీనిని ఔట్‌గా ప్రకటించాడు. కానీ కంబోడియా మాత్రం ఈ ఔట్‌కు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ అంపైర్లు మాత్రం దానిని ఔట్‌గానే ప్రకటించారు. దీంతో కంబోడియా ఈ మ్యాచ్‌లో తదుపరి ఆట ఆడేందుకు నిరాకరించింది. కండోడియా ఆట కొనసాగించకపోవడంతో నిర్వాహకులు ఇండోనేషియాను విజేతగా ప్రకటించారు.
Cambodia abandons the match against Indonesia, after a dubious wicket of Luqman Butt, handing Indonesia a win by forfeit. #SKY11 #Cambodia #Indonesia #Cricket #LuqmanButt #Sports pic.twitter.com/yM6jUuUskS
— Sky11 (@sky11official) November 24, 2023
ఇండోనేషియాతో ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చిన కంబోడియా.. మూడు, ఐదో మ్యాచ్‌లలో గెలిచింది. తొలి, రెండు, నాలుగు మ్యాచ్‌లతో పాటు ఆరో మ్యాచ్ కూడా గెలిచిన ఇండోనేషియా.. 4-2 తేడాతో విజేతగా నిలిచింది. ఆరో మ్యాచ్‌లో ఔట్ వివాదంతో కంబోడియా.. ఆఖరి మ్యాచ్ ఆడేందుకు కూడా ఆసక్తి చూపలేదు.
Hosts #Indonesia beat #Cambodia 7 Match #T20I Series 4-2, Last Match Abandoned (20-23 Nov) 🏏#INA won 1st, 2nd, 4th & 6th Match 🇮🇩#CAM won 3rd & 5th Match 🇰🇭#CricketTwitter #CricketNews #Cricket #T20Cricket pic.twitter.com/1AxKIJuTY2
— Nishant Dravid (@nishantdravid73) November 23, 2023