BWF Championship | తెలుగు షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశాడు. స్పెయిన్‌కు ఆటగాడు పాబ్లో అబియాన్‌పై 21-12, 21-16తో వరుస సెట్లలో గెలిచి మ్యాచ్‌లో గెలుపొందాడు. అయితే మరో తెలుగు కుర్రాడు సాయి ప్రణీత్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. తన తొలి మ్యాచ్‌లో ప్రణీత్ ఓటమిపాలయ్యాడు.
తొలి సెట్లో 21-17తో ఆధిపత్యం ప్రదర్శించిన ప్రణీత్.. ఆ తరువాత రెండు సెట్లలో 7-21,18-21తో నిరాశపరిచాడు. దీంతో ఈ టోర్నీ నుంచి సాయి ప్రణీత్ నిష్క్రమించాడు. ఈ టోర్నమెంటులో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కరోలినా మారిన్ ఆడటం లేదు.
రియో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన కరోలినా.. కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతోంది. దీన్నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆమె ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.