కైరో: అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ వేదికపై తెలంగాణ అమ్మాయి సత్తా చాటింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న ఫారోస్ కప్ 2021లో హైదరాబాదీ అరుణా రెడ్డి సూపర్ షో కనబరిచింది. ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన బుద్ధా అరుణా రెడ్డి రెండు స్వర్ణ పతకాలు సాధించింది. అరుణా రెడ్డి ఇటీవలే మోకాలి సర్జరీ నుంచి కోలుకొని మరీ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. ఇంతకుముందు 2018 ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్‌లో అరణా రెడ్డి కాంస్యం సాధించింది.