దోహా: ఫుల్బాల్ వరల్డ్‌కప్‌లో ఇవాళ కెమరూన్‌తో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0 గోల్ తేడాతో నెగ్గింది. ఆరంభం నుంచి హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్ 48వ నిమిషంలో స్విజ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో గోల్ కొట్టాడు. ఎంబోలో ఆడుతోంది స్విట్జర్లాండ్ తరపున… కానీ అతను పుట్టింది మాత్రం కెమెరూన్‌లో.
ఇవాళ్టి మ్యాచ్‌లో అతను తాను పుట్టిన దేశంపైనే గోల్ చేయాల్సి వచ్చింది. ఎంబోలో పెరిగింది బాసల్ పట్టణంలో. కానీ, అతను కెమెరూన్ రాజధాని యాండోలో పుట్టాడు. 8 ఏళ్ల క్రితమే అతను స్విట్జర్లాండ్ పౌరసత్వం పొందాడు. కెమెరూన్పై గోల్ కొట్టినా.. ఆ సంబరాన్ని సంపూర్ణంగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు ఎంబోలో.