‘డీ’ ధమాకా
- డేవిడ్ మిల్లర్, డస్సెన్ వీరవిహారం
- అజేయ అర్ధసెంచరీలతో విజృంభణ
- తొలి టీ20లో సఫారీలదే గెలుపు
- భారత్ వరుస విజయాలకు బ్రేక్
ఢిల్లీ అరుణ్‌జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. కిక్కిరిసిన అభిమానుల మధ్య బ్యాటర్లు బౌండరీలతో హోరెత్తించారు. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయి అయ్యింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా విజృంభణతో తొలుత పోరాడే స్కోరు అందుకున్న టీమ్ఇండియా..సఫారీలకు కళ్లెం వేయడంలో విఫలమైంది. డీ ద్వయం డేవిడ్ మిల్లర్, డస్సెన్ వీరవిహారంతో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. భారత బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ మిల్లర్, డస్సెన్ పరుగుల విధ్వంసం కొనసాగించారు. గెలిచి టీ20ల్లో తమ జైత్రయాత్రను కొనసాగిద్దామనుకున్న భారత ఆశలను దక్షిణాఫ్రికా బ్రేక్ చేసింది.
న్యూఢిల్లీ: ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులకు పసందైన విందు అందించింది. స్టార్ క్రికెటర్ల గైర్హాజరీ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ తమ గెలుపు జోరును కొనసాగించలేకపోయింది. గురువారం ఆఖరి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0తో ముందంజ వేశారు. గెలిచి టీ20ల్లో అత్యధిక(13) విజయాల రికార్డును సొంతం చేసుకుందామనుకున్న టీమ్ఇండియా ఆశలు నెరవేరలేకపోగా, టీ20ల్లో సఫారీలు తమ అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. తొలుత ఇషాన్‌కిషన్(48 బంతుల్లో 76, 11ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయాస్ అయ్యర్(36), హార్దిక్‌పాండ్యా(12 బంతుల్లో 31 నాటౌట్, 2ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ 20 ఓవర్లలో 211/4 స్కోరు చేసింది. మహారాజ్, నోర్టె, పార్నెల్, ప్రిటోరియస్ ఒక్కో వికెట్ తీశారు.
మిల్లర్, డస్సెన్ ధమాకా:
లక్ష్యఛేదనలో సఫారీలకు అనుకున్న రీతిలో శుభారంభం దక్కలేదు. కెప్టెన్ బవుమా(10) ఆదిలోనే నిష్క్రమించాడు. మూడో డౌన్లో వచ్చిన ప్రిటోరియస్(29) వచ్చి రావడంతోనే విరుచుకుపడ్డాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడు భారీ సిక్స్‌లతో చెలరేగాడు. ఈ క్రమంలో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. 20 పరుగుల తేడాతో ప్రిటోరియస్, డికాక్(22) ఔట్ అయ్యారు. ఈ క్రమంలో మిల్లర్, డస్సెన్ మ్యాచ్ స్వరూపానే మార్చేశారు. తన ఐపీఎల్ సూపర్ ఫామ్‌ను మిల్లర్ కొనసాగిస్తూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించుకుంటూ పోయాడు. ఎదురైన బౌలర్‌నల్లా చితకబాదడంతో లక్ష్యం చేరువైంది. వీరిద్దరి బౌండరీల హోరుతో స్టేడియం హోరెత్తిపోయింది. మిల్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం కటక్‌లో జరుగనుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో (కిషన్ 76, అయ్యర్ 36, పార్నెల్ 1/32, ప్రిటోరియస్ 1/35), దక్షిణాఫ్రికా: 19.1 ఓవర్లలో 212/3 (డస్సెన్ 75 నాటౌట్, మిల్లర్ 64 నాటౌట్, అక్షర్ పటేల్ 1/40, భువనేశ్వర్ 1/43)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

