Dani Alves | బ్రెజిల్ ఫుట్‌బాలర్ డానీకి మరో షాక్.. విడాకులకు సిద్ధపడిన భార్య
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రెజిల్ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్‌కు మరో షాకింగ్ న్యూస్. అతడి భార్య జొయానా సాంజ్ విడాకులకు దరఖాస్తు చేసింది. అంతేకాదు అతనితో కలిసి దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించింది.
Dani Alves : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రెజిల్ ఫుట్‌బాలర్ డానీ అల్వెస్‌కు మరో షాకింగ్ న్యూస్. అతడి పెళ్లి త్వరలోన పెటాకులు కానుంది. అతడి భార్య జొయానా సాంజ్ ఈమధ్యే విడాకులకు దరఖాస్తు చేసింది. అంతేకాదు వాళ్లిద్దరూ సన్నిహితంగా దిగిన ఫొటోల్లో చాలా వాటిని గత వారం ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించింది. తనపై ఆరోపణలు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదని చెప్పిన నమ్మబలికిన డానీ, ఆ తర్వాత ఆమె ఇష్టప్రకారమే శారీరకంగా కలిశామని ఒప్పుకున్నాడు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన జొయానో అతడితో వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమైంది.
పోయిన ఏడాది బార్సిలోనా నైట్ క్లబ్లో జరిగిన పార్టీలో డానీ, ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ విషయమై సదరు మహిళ డానీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అనుమతి లేకుండా తన లోదుస్తుల్లో డానీ చేయి పెట్టాడని ఆమె పోలీసులకు తెలిపింది. డానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే వార్తలు స్పెయిన్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే.. డానీ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఆ మహిళ ఎవరో తనకు తెలియదని చెప్పాడు. దాంతో, జొయానా భర్త డానీకు మద్దతుగా నిలిచింది. స్పెయిన్ పోలీసులు జనవరి 20న ఈ బ్రెజిల్ ఫుట్‌బాలర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్‌లో ఉన్నాడు. ఈమధ్యే జొయానా తల్లి అంత్యక్రియలకు అతను హాజరయ్యాడు. ఆ క్షణం జొయానా ‘నా జీవితంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కోల్పోయాను’ అని అంది.
2017లో పెళ్లి
మోడల్ అయిన జొయానోకు, డానీకి 2015లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట 2017లో పెళ్లి చేసుకుంది. బ్రెజిల్ ఫార్వర్డ్ ప్లేయర్ అయిన డానీ ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడాడు. నాకౌట్ మ్యాచ్‌లో నెయ్మర్ గైర్హాజరీలో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు కూడా. అంతేకాదు బ్రెజిల్ వరల్డ్ కప్ జట్టులో పెద్ద వయస్కుడు అతనే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

