చెన్నై: వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ బ్రేవోను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. చాన్నాళ్లుగా చెన్నై జట్టుతో కొనసాగుతున్న బ్రేవో.. ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. సీఎస్కే ఫ్రాంచైజీ లక్ష్మీపతి బాలాజీ స్థానంలో బ్రేవోను బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ‘ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా బౌలర్లకు సలహాలు ఇచ్చేవాడిని.. ఇప్పుడు కూడా అదే చేస్తా ’ అని బ్రేవో అన్నాడు. ఐపీఎల్లో 161 మ్యాచ్‌లాడిన బ్రేవో 183 వికెట్లతో ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబాతాలో టాప్‌లో ఉన్నాడు.