Womens World Boxing Championship: భారత బాక్సర్ల జోరు.. క్వార్టర్స్‌లోకి నీతూ, మనీషా
Womens World Boxing Championship: నీతూ, మనీషాలు క్వార్టర్స్‌లోకి ఎంటర్ అయ్యారు. మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. రెండు బౌట్లలోనూ మనవాళ్లు పంచ్‌లతో ఇరగదీశారు.
న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్(Womens World Boxing Championship)లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇండియన్ మహిళా బాక్సర్ నీతూ ఘంగాస్(Nitu Ghangas).. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. 45-48 కేజీల విభాగంలో ఆమె ఇవాళ జరిగిన బౌట్లో విక్టరీ కొట్టింది. ప్రి క్వార్టర్స్‌లో నీతూ కేవలం 128 సెకన్లలోనే బౌట్‌ను గెలిచేసింది. ఆమె పంచ్‌లకు తజకిస్తాన్ బాక్సర్(Tajakistan boxer) సుమయ్య హడలెత్తిపోయింది.
Consecutive RSC win for Nitu 🔥🤩
Into the Quarterfinals 💥💪
Book your tickets now 🔗:https://t.co/k8OoHXoAr8@AjaySingh_SG l @debojo_m#itshertime #WWCHDelhi #WorldChampionships @IBA_Boxing @Media_SAI @paytminsider @IamNidhieSharma @NituGhanghas333 pic.twitter.com/mY8VqhJ3BZ
— Boxing Federation (@BFI_official) March 21, 2023
మరో బాక్సర్ మనీష(boxer Manisha) కూడా ప్రీక్వార్టర్స్ ఫైట్‌లో నెగ్గింది. చాలా ఈజీగా ప్రత్యర్థిని కొట్టి మనీషా క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
Marvellous Manisha at it again🔥🤩
Enters the Quarterfinals 💥💪
Book your tickets now 🔗:https://t.co/k8OoHXoAr8@AjaySingh_SG l @debojo_m#itshertime #WWCHDelhi #WorldChampionships @IBA_Boxing @Media_SAI @paytminsider @BoxerMoun pic.twitter.com/cE9gjAZT24
— Boxing Federation (@BFI_official) March 21, 2023
సోమవారం జరిగిన 75కిలోల ప్రిక్వార్టర్స్ బౌట్లో లవ్లీనా 5-0 తేడాతో మెక్సికో బాక్సర్ వెనెస్సా ఒర్టిజ్పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ అస్సాం బాక్సర్ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడింది. మరోవైపు 54 కిలోల విభాగంలో సాక్షి ..జజిరా ఉర్కబయేవా(కజకిస్థాన్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అనూహ్య రీతిలో జట్టులో చోటు దక్కించుకున్న ప్రీతి(54కి) 3-4 తేడాతోజింట్పాంగ్ జుటామస్(థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

