ఢిల్లీ: గాయం కారణంగా ఐపీఎల్ 19వ సీజన్ మొత్తానికి దూరమైన బౌలర్ శివమ్ మావి స్థానాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. యువ ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీష్‌తో భర్తీ చేసింది. ఇటీవల అండర్-19 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన అంబరీష్ ఆ టోర్నీలో 11 వికెట్లతో సత్తాచాటాడు.