Shami – Poyal Gosh | షమీని పెండ్లి చేసుకుంటా.. ఆ ఒక్క షరుతుకు అంగీకరిస్తేనే..?
Shami - Poyal Gosh : సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌లో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పడుతున్నాడు. బుల్లెట్ లాంటి బంతులతో బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. ప్రపంచ కప్‌లో షమీ అద్బుత ప్రదర్శనకు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్()Poyal Gosh) ఫిదా...
Shami – Poyal Gosh : సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌లో భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పడుతున్నాడు. బుల్లెట్ లాంటి బంతులతో బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. మెగా టోర్నీలో వికెట్ల వేట కొనసాగిస్తూ.. టీమిండియా సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ స్పీడ్‌స్టర్ కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ప్రపంచ కప్‌లో షమీ అద్బుత ప్రదర్శనకు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్()Poyal Gosh) ఫిదా అయింది. పేసర్‌ను అభినందించడంతోనే ఆగకుండా అతడిని పెండ్లి చేసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది.
అయితే.. ఒక్క షరతుకు షమీ ఒప్పుకోవాలని పాయల్ అంటోంది. ఇంతకు ఆ షరతు ఏంటో తెలుసా..? షమీ ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకోవాలట. షమీ నువ్వు నీ ఇంగ్లీష్ భాషను మెరుగుపరుచుకో. కచ్చితంగా నిన్ను పెండ్లి చేసుకుంటా అని పాయల్ సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you 🤣🤣
— Payal Ghoshॐ (@iampayalghosh) November 2, 2023
వరల్డ్ కప్‌లో టీమిండియా తురుపుముక్క షమీ నిప్పులు చెరుగుతున్నాడు. వరుస మ్యాచుల్లో సూపర్ స్పెల్‌తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఈ పేసర్ ఇప్పటివరకూ ఆడిన 4 మ్యాచ్‌లు 16 వికెట్లు పడగొట్టాడు. ఏకంగా రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరహో అనిపించాడు. ప్రస్తుతం అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు.

తెలుగులో పాయల్.. మంచు మనోజ్ సరసన ‘ప్రయాణం’ సినిమాలో నటించింది. ఆ తర్వాత పటేల్ కీ పంజాబీ షాదీ, కోయ్ జానే నా వంటి సినమాల్లో మెరిసింది. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న పాయల్.. రమాదాస్ అథవాలేకు చెందిన రాజకీయ పార్టీకి వైస్ ప్రెసిడెంట్. ఇక షమీ 2014లో హసిన్ జహన్‌ను పెండ్లి చేసుకున్నాడు. అయితే.. ఇద్దరి మధ్య మనఃస్ఫర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం వీళ్ల విడాకుల కేసు కోర్టులో ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
-
ODI World Cup 2023 | పవర్ ప్లేలోనే సగం వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక
-
Bellampalli | బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్న బెల్లంపల్లి ప్రజానీకం.. గ్యాలరీ
-
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనుకకు పోతది: మంత్రి హరీశ్‌రావు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

