ODI World Cup 2023 | పవర్ ప్లేలోనే సగం వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ ఆఖరి లీగ్ మ్యాచులో శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో కుశాల్ పెరీర(51 : 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ షాట్ ఆడబోయి..
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ ఆఖరి లీగ్ మ్యాచులో శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో కుశాల్ పెరీర(51 : 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ షాట్ ఆడబోయి శాంట్నర్ చేతికి చిక్కాడు. దాంతో, లంక 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
అంతకుముందు ట్రెంట్ బౌల్ట్ వేసిన ఓవర్లో చరత అసలంక(8) ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో కివీస్ రివ్యూ తీసుకొని వికెట్ సాధించింది. ప్రస్తుతం మాథ్యూస్(0), ధనంజయ డిసిల్వా(4) ఆడుతున్నారు. 10 ఓవర్లకు లంక స్కోర్.. 74/5
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ పథుమ్ నిస్సంక(2) ను టిమ్ సౌథీ పెవిలియన్ పంపాడు. అనంతరం డేంజరస్ బౌల్ట్ వికెట్ల వేట మొదలెట్టాడు. అతడు విజృంభించడంతో.. ఒకే ఓవర్లో కెప్టెన్ కుశాల్ మెండిస్(6), సమరవిక్రమ (1) ఔటయ్యారు. దాంతో, లంక ఒత్తిడిలో పడిపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

