మట్టి కోర్టులో మహాసంగ్రామం

నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్.. ఫేవరెట్‌గా నాదల్
అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పట్టాలని ఒకరు.. ఆ ఫీట్‌కు చేరువవ్వాలని మరొకరు..
మట్టి కోర్టులో సత్తాచాటాలని ఇంకొకరు.. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు ముగ్గురు మొనగాళ్లు తమ కసరత్తుల్లో మునిగిపోయారు. పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల మధ్య
సాగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది.
పారిస్: కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో స్తంభించిపోయిన క్రీడాలోకంలో కొత్త ఉత్సాహం నింపేందుకు ఫ్రెంచ్ ఓపెన్ సిద్ధమైంది. మట్టికోట మహారాజు రఫేల్ నాదల్ (స్పెయిన్), ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ప్రధాన ఆకర్షణగా.. ఆదివారం నుంచి పారిస్‌లోని రోలాండ్ గారోస్‌లో పోటీలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు టెన్నిస్ అభిమానులను అలరించనున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో మకుటం లేని మహారాజుగా పేరున్న నాదల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా.. అతడికి సిట్సిపాస్, థీమ్, జ్వెరేవ్ వంటి యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.
ఘనమైన రికార్డు..: కెరీర్లో ఇప్పటి వరకు 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్.. అందులో 13 ఇక్కడే గెలుచుకోవడం విశేషం. 2005లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ బుల్.. రోలాండ్ గారోస్‌లో 100 విజయాలు సొంతం చేసుకొని అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం పురుషుల టైటిల్స్‌లో ఫెదరర్ (20)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న నాదల్.. మరో టైటిల్ చేజిక్కించుకొని శిఖరాగ్రాన నిలువాలని చూస్తుంటే.. తాను ఫేవరెట్‌ను కాదని ముందే ప్రకటించినా.. లేటు వయసులో ఘాటు విజయంతో దుమ్మురేపాలని ఫెదరర్ భావిస్తున్నాడు.
ముగ్గురు మొనగాళ్లు ఒకే పార్శంలో..
ప్రస్తుత తరంలో బిగ్ త్రీగా పేరు పొందిన నాదల్, ఫెదరర్, జొకోవిచ్ ఒకే పార్శంలో ఉండటంతో ఫైనల్‌కు ముందే మహాసంగ్రామాలు ఎదురు కానున్నాయి. టోర్నీ అంచనాలకు తగ్గట్లు సాగితే.. క్వార్టర్స్‌లో ఫెదరర్, జొకో తలపడే అవకాశాలు ఉన్నాయి. ఇందులో నెగ్గిన వారిని నాదల్ ఢీకొంటాడు. నాదల్ ఇప్పటి వరకు ఇక్కడ రెండు సార్లు మాత్రమే ఓటమి పాలవడం.. మట్టికోర్టులో అతడి ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నది. ఇక మహిళల విభాగంలో ఆష్లే బార్టీ టాప్‌సీడ్‌గా బరిలోకి దిగనుండగా.. సెరెనా విలియమ్స్, స్వియాటెక్, కెర్బర్, ముగురుజా సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అమెరికా యువ కెర టం కొకొ గాఫ్ సంచలనాలు సృష్టించాలని చూస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- French Open
- nadal
- Tennis
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

