Sports Budget : వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి ఊతమిస్తూనే.. కీలకమైన వాటికి నిధులు తగ్గించింది కేంద్రం. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకంటున్నామని చెబుతూ క్రీడా పరికరాలు, వస్తువుల తయారీకి రూ.500 కోట్లు కేటాయించారు. దేశంలో క్రీడల అభివృద్ధికి ఇంత భారీ మొత్తం నిధులు ఇవ్వాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి. అయితే.. జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ(NADA)కు మాత్రం రూ.3 కోట్లు, ఖేలో ఇండియా (Khelo India) కార్యక్రమానికి సైతం రూ.36 కోట్లు కోత విధించారు.
ఫిబ్రవరి 1 ఆదివారం మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. క్రీడలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పిన నిర్మల పరికరాల తయారీకి రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. క్రీడా పరికరాలు, వస్తువుల తయారీకి ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ‘మేకిన్ ఇండియా ‘ ద్వారా క్రీడా వస్తువుల తయారీ, పరిశోధన, ఆవిష్కరణలకు ఉపకరించేలా నిధులు కేటాయించామని నిర్మల వెల్లడించారు.
UNION BUDGET 2026-27 PROPOSES DEDICATED INITIATIVE FOR SPORTS GOODS TO PROMOTE MANUFACTURING, RESEARCH AND INNOVATION
🌀Initiative builds on India’s potential to emerge as a global hub for high quality, affordable sports goods
🌀Khelo India mission announced to transform the… pic.twitter.com/E4MWas5IE8
— PIB India (@PIB_India) February 1, 2026
ఈసారి బడ్జెట్లో రూ. 4,479.88 కోట్లు కేటాయించారని, గత ఏడాదితో పోల్చితే రూ.1,133.34 కోట్ల కేటాయింపు అదనంగా జరిగిందని యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. క్రీడా పరికరాల తయారీకి బడ్జెట్లో రూ.500 కేటాయించడం పట్ల క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.
ప్రతిభావంతులను గుర్తించి, సానబెట్టే భారత స్పోర్ట్స్ సమాఖ్య(SAI)కు బడ్జెట్ రూ. 880 కోట్ల నుంచి రూ.917.38 కోట్లకు పెరిగింది. అదే సమయంలో జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థకు రూ.3 కోట్ల కోత విధిస్తూ.. రూ.20.30 కోట్లు ప్రకటించారు. గత ఏడాది నాడాకు కేటాయించే బడ్జెట్లో రూ.28.55 కోట్ల నుంచి రూ.24.30 కోట్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఇక ఖేలో ఇండియా కార్యక్రమానికి కూడా కోత తప్పలేదు. నిరుడు రూ. 1,000 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.924.35 కోట్లతో సరిపుచ్చింది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో రూ.50 కోట్లు ప్రకటించారు ఆర్ధిక మంత్రి.
Under Union Budget 2026–27, the Khelo India Mission gets a renewed push to build a strong sporting nation.
The focus includes integrated talent development through dedicated training centres, structured development of coaches and support staff, use of sports science and… pic.twitter.com/HZPO1iuQlp
— MyGovIndia (@mygovindia) February 1, 2026