Team India | భువీ భవితవ్యం ప్రశ్నార్ధకమే.. లెజెండరీ క్రికెటర్ ఏమన్నారంటే?
Team India | ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా ఆటగాళ్ల జాబితాలో పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరు తప్పకుండా ఉంటుంది. ఒకప్పుడు తన స్వింగ్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన భువీ..

ఫామ్ లేమితో బాధపడుతున్న టీమిండియా ఆటగాళ్ల జాబితాలో పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరు తప్పకుండా ఉంటుంది. ఒకప్పుడు తన స్వింగ్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన భువీ.. కొంతకాలంగా సరైన ప్రదర్శన చేయలేదు. సఫారీలతో వన్డే సిరీస్‌లో కూడా రాణించలేదు. అంతకుముందు ఐపీఎల్లో కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు.
ఈ క్రమంలో ప్రస్తుత టీమిండియాలో భువనేశ్వర్ స్థానం ప్రశ్నార్ధకంగా మారిందని మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రానున్న రెండేళ్లలో కీలకమైన ఐసీసీ ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో భువీకి ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని లిటిల్ మాస్టర్ అన్నాడు.
‘ఒకప్పుడు రెండు వైపులా స్వింగ్ చేస్తూ అదరగొట్టిన భువనేశ్వర్.. ఇప్పుడు పేస్ విషయంతోపాటు సరైన ప్రాంతాల్లో కూడా బంతులు వేయలేకపోతున్నాడు. స్వింగ్ కూడా దాదాపు కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత విశ్రాంతి తీసుకొని బేసిక్స్‌పై శ్రమించాలి’ అని పేర్కొన్నాడు. అలాగే భువీ స్థానంలో దీపక్ చాహర్ మంచి ప్రత్యామ్నాయంలా కనిపిస్తున్నాడన్నాడు.
రెండు వైపులా స్వింగ్ చేయడంతోపాటు, అవసరమైన సమయంలో బ్యాటింగ్ కూడా చేసే సామర్ధ్యం చాహర్‌కు ఉందని సన్నీ చెప్పాడు. మరి వచ్చే మెగా టోర్నీల కోసం టీమిండియాలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

