భారత్‌లో ప్రపంచ బాక్సింగ్ టోర్నీ
వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. న్యూఢిల్లీ వేదికగా మెగాటోర్నీ జరుగనుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఐబీఏ), బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) మధ్య బుధవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. న్యూఢిల్లీ వేదికగా మెగాటోర్నీ జరుగనుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఐబీఏ), బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) మధ్య బుధవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. గతంలో పురుషుల ప్రపంచ టోర్నీ ఆతిథ్యాన్ని చేజార్చుకున్న భారత్..మహిళల చాంపియన్‌షిప్ నిర్వహించడం ఇది మూడోసారి. 75 నుంచి 100 దేశాలకు చెందిన బాక్సర్లు పాల్గొనే అవకాశమున్న టోర్నీలో ప్రైజ్‌మనీని రూ.19.50 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో స్వర్ణ పతక విజేతలకు రూ.81 లక్షలు దక్కనున్నాయి. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మాట్లాడుతూ ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తిరిగి నా టైటిల్‌ను నిలబెట్టుకుంటే వచ్చే డబ్బులతో ఇంటితో పాటు మెర్సిడెజ్ కారు కొంటాను. ఐబీఏ అధ్యక్షుడు క్రెమ్లెవ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి కారులో షికారు చేస్తాం’ అని అంది. ఒకవేళ నిఖత్ ప్రపంచ టైటిల్ గెలిస్తే తానే కారు కొనిస్తానని క్రెమ్లెవ్ హామీ ఇచ్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

