లండన్ : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎడమ మోకాలికి గురువారం శస్త్రచికిత్స నిర్వహించారు. వచ్చే యేడాది జనవరిలో ఇండియాతో జరుగనున్న సిరీస్‌కు ఫిట్నెస్ కాపాడుకునేందుకు స్టోక్స్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గత కొద్దికాలంగా స్టోక్స్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.
ఇటీవల భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అతడు బ్యాటర్‌గానే పాలుపంచుకున్నాడు. ఇండియాతో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జనవరి 25న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నది. శారీరక శ్రమను తగ్గించుకునేందుకు స్టోక్స్ వచ్చే యేడాది ఐపీఎల్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించిన విషయం తెలిసిందే.