Ben Stokes | టెస్టుల్లో 200 వికెట్లు.. దిగ్గజాల సరసన ఇంగ్లండ్ సారథి
Ben Stokes ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) టెస్టు క్రికెట్లో సంచలనం సృష్టించాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు వికెట్లు తీసిన ఇంగ్లండ్ సారథి అరుదైన క్లబ్లో చేరాడు.
Ben Stokes ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) టెస్టు క్రికెట్లో సంచలనం సృష్టించాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు వికెట్లు తీసిన ఇంగ్లండ్ సారథి అరుదైన క్లబ్లో చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 6 వేల పరుగులు, రెండొందల వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు మేటి ఆల్‌రౌండర్లు గ్యారీ సోబర్స్, జాక్వెస్ కలిస్లు మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
లార్డ్స్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న ఇంగ్లండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 371 పరుగులకు ఆలౌటయ్యింది. 250 పరుగుల ఆధిక్యం సాధించిన స్టోక్స్ సేన ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు పని పడుతోంది.
Ben Stokes becomes just the third player after Garry Sobers and Jacques Kallis to achieve the double of 6000 runs and 200 wickets in Test cricket 🫡#ENGvWI pic.twitter.com/bT04C65Vcb
— ICC (@ICC) July 11, 2024
ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వైట్(4)ను ఔట్ చేసి అండర్సన్ 702వ వికెట్ ఖాతాలో వేసుకోగా.. ఆ తర్వాత స్టోక్స్ కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్ మేకిలే లూయిస్(14), అలిక్ అథనజె(0)లను వెనక్కి పంపి విండీస్‌ను దెబ్బకొట్టాడు.ఈ ఇద్దరి ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో స్టోక్స్ 200 వికెట్ల క్లబ్లో చేరాడు.
ఇవి కూడా చదవండి
- Wimbledon | వింబుల్డన్ ఫైనల్లో జాస్మినె.. అమెరికా ‘నల్లకలువ’ రికార్డు సమం
- Sukesh Chandra Shekar | శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్‌కు జైలు నుంచి ప్రేమలేఖ రాసిన సుకేశ్..! 100 మందికి ఐఫోన్-15 ప్రో గిఫ్ట్‌గా ఇస్తాడటా..?
- Hyundai Exter Knight | దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ ఎక్స్టర్ నైట్ ఆవిష్కరణ.. రూ.8.38 లక్షల నుంచి షురూ..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

