Hyundai Exter Knight | దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ ఎక్స్టర్ నైట్ ఆవిష్కరణ.. రూ.8.38 లక్షల నుంచి షురూ..!
Hyundai Exter Knight | ప్రముఖ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఎక్స్టర్ మార్కెట్లోకి తెచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అప్ డేటెడ్ ఎక్స్టర్ నైట్ (Exter Knite) కారును ఆవిష్కరించింది.
Hyundai Exter Knight | ప్రముఖ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. తన పాపులర్ ఎస్యూవీ ఎక్స్టర్ మార్కెట్లోకి తెచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అప్ డేటెడ్ ఎక్స్టర్ నైట్ (Exter Knite) కారును ఆవిష్కరించింది. ఆల్ -బ్లాక్డ్ థీమ్డ్ ఎక్స్టర్ నైట్ ధర రూ.8.38 లక్షల నుంచి రూ.10.43 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. 2023 జూలై 10న హ్యుండాయ్ తన ఎక్స్టర్ కారును తొలిసారి భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ 93 వేల కార్లను విక్రయించినట్లు ప్రకటించింది.
హ్యుండాయ్ ఎక్స్టర్ నైట్ కారును టాప్ స్పెసిఫికేషన్ ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ వేరియంట్ల ఆధారంగా డిజైన్ చేశారు. ఈ కారు 1.2 లీటర్ల, 4 సిలిండర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఈ కారు ఇంజిన్ గరిష్టంగా 83 పీఎస్ విద్యుత్, 113.8 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
హ్యుండాయ్ ఎక్స్టర్ నైట్ కారు ఐదు మోనోటోన్, రెండు డ్యయల్ టోన్ కలర్ ఆప్షన్లలో వస్తోంది. స్టారీ నైట్, అట్లాస్ వైట్, రేంజర్ కాకీ, అబ్యాస్ బ్లాక్ (న్యూ), షాడో గ్రే (న్యూ), రేంజర్ కాకీ విత్ అబ్యాస్ బ్లాక్ రూఫ్, శాడో గ్రే విత్ అబ్యాస్ బ్లాక్ రూఫ్ (న్యూ) ఆప్షన్లలో అందుబాటులో ఉంటది.
హ్యుండాయ్ ఎక్స్టర్ నైట్ ఎక్స్టీరియర్ ఫీచర్లు ఇవే..
– బ్లాక్ పెయింటెడ్ సైడ్ సిల్ గార్నిష్
– రెడ్ అసెంట్స్ ఆన్ ఫ్రంట్ బంపర్ అండ్ రేర్ టెయిల్ గేట్
– రెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్
– బ్లాక్ ఫ్రంట్ అండ్ రేర్ స్కిడ్ ప్లేట్
– నల్లని రంగులో హ్యుండాయ్ లోగో, ఎక్స్టర్ ఎంబ్లం
– ఎక్స్ క్లూజివ్ నైట్ ఎంబ్లం
ఇవే ఇంటీరియర్ ఫీచర్లు
– రెడ్ అసెంట్స్, స్టిచింగ్ తోపాటు బ్లాక్ ఇంటీరియర్లు
– రెడ్ ఫుట్ వెల్ లైటింగ్
– బ్లాక్ శాటిన్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ అండ్ స్టీరింగ్
– మెటల్ స్కఫ్ ప్లేట్
– ఫ్లోర్ మ్యాట్ విత్ రెడ్ స్టిచింగ్
– నైట్ యునిక్యు సీట్ అప్ హోల్ స్టరీ విత్ రెడ్ స్టిచ్ అండ్ పైపింగ్
వేరియంట్ల వారీగా హ్యుండాయ్ ఎక్స్టర్ నైట్ ధరలు ఇలా
– ఎక్స్టర్ నైట్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఎస్ఎక్స్ – రూ.8.38 లక్షలు
– ఎక్స్టర్ నైట్ మాన్యువల్ ట్రాన్ష్ మిషన్ ఎస్ఎక్స్ డ్యుయల్ టోన్ – రూ.8.62 లక్షలు
-ఎక్స్టర్ నైట్ ఎంటీ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ – రూ.9.71 లక్షలు
-ఎక్స్టర్ నైట్ ఏఎంటీ ఎస్ఎక్స్ – రూ.9.05 లక్షలు
– ఎక్స్టర్ నైట్ ఎఎంటీ ఎస్ఎక్స్ డ్యుయల్ టోన్ – రూ.9.30 లక్షలు
– ఎక్స్టర్ నైట్ ఏఎంటీ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ – రూ.10.15 లక్షలు
– ఎక్స్టర్ నైట్ ఏఎంటీ ఎస్ఎక్స్ (ఓ) కనెక్ట్ డ్యుయల్ టోన్ – రూ.10.43 లక్షలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

