కోహ్లి కెప్టెన్సీపై సీనియర్ల ఫిర్యాదు.. బీసీసీఐ రియాక్షన్ ఇదీ!
ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీపై టీమ్‌లోని సీనియర్ ప్లేయర్స్ గుర్రుగా ఉన్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా.

ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీపై టీమ్‌లోని సీనియర్ ప్లేయర్స్ గుర్రుగా ఉన్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. ఇదే విషయమై బీసీసీఐకి కూడా వాళ్లు ఫిర్యాదు చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అశ్విన్‌తోపాటు రహానే, పుజారాలాంటి సీనియర్లు ఇంగ్లండ్ టూర్లో ఉన్నప్పుడే ఫోన్ ద్వారా బీసీసీఐ కార్యదర్శి జే షాకు ఫిర్యాదు చేశారని, దీంతో బోర్డు కూడా రంగంలోకి దిగి ఇతర ప్లేయర్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నదన్నది ఆ వార్తల సారాంశం. దీనిపై తాజాగా బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు.
ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. టీమ్‌లోని సీనియర్ లేదా జూనియర్ ప్లేయర్ ఎవరూ రాత పూర్వకంగా లేదా మౌఖికంగా కోహ్లి కెప్టెన్సీపై బీసీసీఐకి ఫిర్యాదు చేయలేదని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఇలాంటి చెత్త వార్తలు రాయడం మీడియా మానుకోవాలి. ఆన్ రికార్డ్ చెబుతున్నాను.. ఏ ఇండియన్ క్రికెటర్ కూడా బీసీసీఐకి ఫిర్యాదు చేయలేదు. ఇలాంటి ప్రతి తప్పుడు వార్తకూ బీసీసీఐ సమాధానం ఇవ్వదు. ఇంతకుముందు కూడా వరల్డ్‌కప్ టీమ్‌లో మార్పులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అసలు ఎవరు చెప్పారు అని అరుణ్ ధుమాల్ మండిపడ్డారు.
గత కొన్ని రోజులుగా కోహ్లి కెప్టెన్సీపై టీమ్‌లోని సీనియర్లు గుర్రుగా ఉన్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కొందరు ప్లేయర్స్ నేరుగా బోర్డుకే ఫిర్యాదు చేసినట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ వార్తను ప్రచురించింది. అయితే ఇలాంటి పుకార్లు ఇండియన్ క్రికెట్‌ను దెబ్బ తీస్తాయని ధుమాల్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ను ఫాలో అవుతున్న సీనియర్ జర్నలిస్టులకు ఈ విషయం తెలుసు. క్రికెట్‌కు ఇది చేస్తే బాగుంటుంది. అది చేస్తే బాగుంటుంది అని వాళ్లు సలహాలు ఇవ్వొచ్చు. అది వాళ్ల అభిప్రాయం, మేము దానిని గౌరవిస్తాం. మంచి రిపోర్ట్‌లను నేను కూడా చదవడానికి ఇష్టపడతాను. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు సరికాదు అని ధుమాల్ అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

