Vaibhav Sooryavanshi: నెట్స్‌లో వైభవ్ సూర్యవంశీ భారీ షాట్లు.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ
Vaibhav Sooryavanshi: నెట్స్‌లోనూ తగ్గేదిలేదన్నాడు వైభవ్. నెట్ ప్రాక్టీస్ సమయంలో భారీ షాట్లు కొట్టాడు సూర్యవంశీ. ఆ వీడియోను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇక ఇవాళ ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ జరగనున్నది. మరి తుది జట్టులో వైభవ్ ఉంటాడో లేదో ఇంకా తెలియదు. తొలిసారి టీమిండియా క్రికెటర్లతో వైభవ్ నెట్ ప్రాక్టీస్ చేశాడు.
బెల్ఫాస్ట్: ఐర్లాండ్‌తో ఇవాళ టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నది. బెల్ఫాస్ట్ వేదికగా ఆ మ్యాచ్ జరగనున్నది. అయితే 15 ఏళ్ల సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఆ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమించాడు. వాస్తవానికి తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందో లేదో తెలియదు. కానీ టీమిండియా ప్లేయర్లతో కలిసి తొలిసారి నెట్స్‌లో జోరుగా ప్రాక్టీస్ చేశాడు వైభవ్. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో మేటి బౌలర్లను ఉతికారేసిన సూర్యవంశీ.. ఆ ఊపులోనే నెట్స్‌లో కూడా భారీ షాట్లు కొట్టాడు. సూర్యవంశీ ప్రాక్టీస్‌కు చెందిన ఓ వీడియోను ఇవాళ బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. టీనేజ్ ఓపెనర్ వైభవ్.. భారీ షాట్లతో నెట్స్ బౌలర్లను వణికించాడు. ఎటువంటి భయం లేకుండానే .. టీమిండియా బౌలర్లను ఆడుకున్నాడు. రకరకాల షాట్లతో ఐర్లాండ్‌తో మ్యాచ్ కోసం వైభవ్ ప్రిపేరయ్యాడు. ఆ వీడియోను మీరూ వీక్షించాడు.
Start of something special 🌟
🎥 Glimpses of Vaibhav Sooryavanshi’s first time in the #TeamIndia nets 🤩#IREvIND pic.twitter.com/zp3mPMch5R
— BCCI (@BCCI) June 26, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

