IPL 2026: ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మనీ లేనట్లే.. మరో భారీ ప్లాన్ వేసిన బీసీసీఐ !
IPL 2026: శనివారం నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం అవుతోంది. అయితే ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఈసారి ఆ మెగా టోర్నీని ప్రారంభించనున్నారు. దీనికి బదులుగా క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్గా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది.
ముంబై: ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఈసారి ఆ మెగా టోర్నీని ప్రారంభించనున్నారు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో హైదరాబాద్, బెంగుళూరు జట్ల మధ్య తొలి ఫైట్ జరగనున్నది. ఇక గత ఏడాది విక్టరీ పరేడ్ సమయంలో పెను విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ జట్టు ర్యాలీకి వేల సంఖ్యలో జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ అభిమానుల స్మృతికి నివాళిగా ఈసారి ప్రారంభం వేడుకలను నిర్వహించడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
సాంస్కృతిక, వినోద వేడుకలను చేపట్టడం లేదని ఆ అధికారి చెప్పారు. కానీ ఐపీఎల్ క్లోజింగ్ సెర్మనీ కోసం మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఘనంగా క్లోజింగ్ సంబరాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు ఓ మీడియా తన కథనంలో రాసింది. 2025లో కోల్కతాలో ఓపెనింగ్ వేడుకలను గ్రాండ్గా నిర్వహించారు. షారూక్ ఖాన్, శ్రేయాస్ ఘోషల్, కరన్ అజులా ఆ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

