IND vs ENG 1st Test: ఇండియాలో బజ్‌బాల్ అంటే ఇట్లుంటది మరి..! స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుంటే గురుకబెట్టి నిద్రపోతున్న మహిళ
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌లో తమ ఆటగాళ్ల ఆట చూసి ఎగబడి క్రికెట్ స్టేడయాలకు పోటెత్తిన ఆ జట్టు అభిమానులు.. ఇండియాలో మాత్రం వాళ్ల ఆట చూసి ‘ఇదేం ఆటరా బాబు’ అంటూ పెదవి విరుస్తున్నారు. ఓ మహిళ అయితే బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండగా...
IND vs ENG 1st Test: ‘బజ్‌బాల్’.. గడిచిన ఏడాదిన్నరగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తమ దూకుడైన ఆటకు పెట్టుకున్న ముద్దుపేరు. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఆ జట్టు ఈ ఆటతో దుమ్మురేపుతోంది. సంప్రదాయ టెస్టు క్రికెట్ ఆటను మార్చుతూ.. స్టేడియాలకు జనాలను రప్పిస్తున్నది. ఇంగ్లండ్‌లో టెస్టులు జరిగితే స్టేడియాలు మొత్తం నిండుగా ఫుల్ జోష్‌గా ఉంటాయి. అయితే ఇండియాలో మాత్రం ఈ బజ్‌బాల్ పప్పులుడకలేదు. ఇండియా – ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక జట్టు తమకు అచ్చొచ్చిన దూకుడుతో అదరగొట్టాలని బరిలోకి దిగి బొక్కబోర్లా పడింది. ఇంగ్లండ్‌లో తమ ఆటగాళ్ల ఆట చూసి ఎగబడి క్రికెట్ స్టేడయాలకు పోటెత్తిన ఆ జట్టు అభిమానులు.. ఇండియాలో మాత్రం వాళ్ల ఆట చూసి ‘ఇదేం ఆటరా బాబు’ అంటూ పెదవి విరుస్తున్నారు. ఓ మహిళ అయితే ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండగా మిట్టమధ్యాహ్నం అయినా ఆదమరిచి నిద్రపోతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఉప్పల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 40 ఓవర్లకు సగం వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్నర్ల త్రయం అశ్విన్, అక్షర్, జడేజాల ధాటికి ఇంగ్లండ్ అల్లాడింది. అప్పటికే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను బెన్ స్టోక్స్ ఆదుకునే యత్నం చేశాడు. 40 ఓవర్ల సమయానికి క్రీజులో ఉన్న స్టోక్స్.. 23 బంతుల్లో 6 పరుగులే చేశాడు. అప్పుడే స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఓ ఇంగ్లీష్ క్రికెట్ ఫ్యాన్.. ఆదమరిచి నిద్రపోతోంది. అదే సమయంలో కెమెరామెన్ కెమెరాను ఆమెవైపునకు తిప్పడంతో భారత క్రికెట్ అభిమానులు ‘బజ్‌బాల్’పై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
POV: You are watching Bazball in India. pic.twitter.com/pfUcYgA75m
— Silly Point (@FarziCricketer) January 25, 2024
Very dull match. England looks an amateur side
— 👑Regal👑 (@anubhav4sure) January 25, 2024
భారత్‌లో బజ్‌బాల్ అంటే ఇలాగే ఉంటదని, మ్యాచ్ చాలా డల్‌గా సాగుతుందని ఇంగ్లండ్ అభిమానులే ఫీల్ అవుతున్నారని కామెంట్ చేస్తున్నారు. బజ్‌బాల్ ఆట ఇండియాలో నడవదని.. అన్నిఫ్లాట్పిచ్లు కాదని ఇంగ్లండ్ గుర్తెరగాలని సూచిస్తున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్‌ను వదిలి డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లారని, ఇది చాలా విచారకరమని ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ వాపోతున్నారు.
Defensive technique of current English batmen are pathetic.
— N.G. (@Ngoswami99) January 25, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

