Kabul Premier League | కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. ఒకే ఓవర్లో 7 సిక్సర్లు.. వీడియో చూశారా..!
Kabul Premier League : అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న కాబూల్ ప్రీమియర్ లీగ్(Kabul Premier League)లో సంచలనం నమోదైంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తరహాలో ఓ యువ ఆటగాడు చెలరేగిపోయాడు. యూవీ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగా.. ఇతను ఏకంగా ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు ఓ ఫోర్ కూడా ఉండటంతో....
Kabul Premier League : అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న కాబూల్ ప్రీమియర్ లీగ్(Kabul Premier League)లో సంచలనం నమోదైంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తరహాలో ఓ యువ ఆటగాడు చెలరేగిపోయాడు. యూవీ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగా.. ఇతను ఏకంగా ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు ఓ ఫోర్ కూడా ఉండటంతో ఆ ఓవర్లో ఏకంగా 49 పరుగులు వచ్చాయి. ఈ అరుదైన ఫీట్‌కు కాబూల్ ప్రీమియర్ లీగ్ వేదికైంది.
లీగ్‌లో భాగంగా శనివారం షాహీన్ హంటర్స్(Shaheen Hunters), అబాసిన్ డిఫెండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. షాహీన్ హంటర్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సాదిఖుల్లా అటల్(Sediqullah Atal) సంచనల ఇన్నింగ్స్‌తో విశ్వరూపం కనబరిచాడు.
మొదట బ్యాటింగ్ చేసిన షాహీన్ హంటర్స్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 213 పరుగులు చేసింది. 18 ఓవర్లలో 158/6తో ఉన్న షాహీన్ హంటర్స్‌కు సాదిఖుల్లా అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అమీర్ జజాయ్(Amir Zazai) వేసిన 19వ ఓవలో సాధిఖుల్లా చరిత్ర సృష్టించాడు. వరుసగా 7+నోబ్, 5+వైడ్, 6, 6, 6, 6, 6, 6 బాదాడు. ఫలితంగా ఓకే ఓవర్లో షాహీన్ హంటర్స్ ఖాతాలో 48 పరుగులు చేరాయి.
సాదిఖుల్లా అటల్

మొత్తంగా ఈ మ్యాచ్‌లో సాధిఖుల్లా 56 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేయడం విశేషం. అనంతరం లక్ష్యఛేదనలో అబాసిన్ డిఫెండర్స్(Abasin Defenders) 18.3 ఓవర్లలో 121 పరుగులకే కుప్పుకూలి.. 92 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అజేయ సెంచరీతో చెలరేగిన సాదిఖుల్లా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Hero Rajinikanth – SRH | హైదరాబాద్ ఫ్రాంచైజీ మంచి ఆటగాళ్లను ఎంచుకోవాలి.. కావ్యను దిగాలుగా చూసి బాధేసింది : రజనీకాంత్
James Anderson | ‘నాలో ఇంకా చాలా ఆట ఉంది’.. జట్టును వీడనంటున్న వెటరన్ పేసర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

