BANvsNZ: స్వదేశంలో అట్టర్ ఫ్లాఫ్.. ఉపఖండంలో సూపర్ డూపర్ హిట్టు.. అజాజ్ పటేల్ ఖాతాలో చిత్రమైన రికార్డు
BANvsNZ: అజాజ్ పటేల్ తీసిన వికెట్లన్నీ విదేశాల్లో.. అదీ ఉపఖండపు పిచ్‌లపై తీసినవే. తన స్వదేశం న్యూజిలాండ్‌లో మాత్రం అతడు ఇంతవరకూ ఖాతా తెరవలేదు.
BANvsNZ: న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్న భారత సంతతి ఆటగాడు అజాజ్ పటేల్ ఉపఖండపు పిచ్‌లపై తానెంత విలువైన బౌలరో మరోసారి నిరూపించుకున్నాడు. రెండేండ్ల
క్రితం భారత్‌తో ముంబై వేదికగా జరిగిన టెస్టులో ఏకంగా పది వికెట్లు సాధించి అరుదైన ఘనత సొంతం చేసుకున్న పటేల్.. బంగ్లాదేశ్‌తో కొద్దిసేపటి క్రితమే ముగిసిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా
ఆరు వికెట్లు పడగొట్టి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే అజాజ్ పటేల్ తీసిన వికెట్లన్నీ విదేశాల్లో.. అదీ ఉపఖండపు పిచ్‌లపై తీసినవే. తన స్వదేశం న్యూజిలాండ్‌లో మాత్రం అతడు
ఇంతవరకూ ఖాతా తెరవలేదు.
అన్ని విదేశాల్లోనే..
అజాజ్ పటేల్ ఇప్పటివరకూ తన టెస్టు కెరీర్లో 16 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 29.75 సగటుతో 62 వికెట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు. నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అజాజ్ బెస్ట్బౌలింగ్ 10/119గా ఉంది. ఈ వికెట్లన్నీ స్పిన్‌కు అనుకూలించే ఉపఖండపు పిచ్‌లు అయిన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈలో తీసినవే కావడం గమనార్హం. స్వదేశంలో అతడు మూడు టెస్టులు ఆడి 49 ఓవర్లు వేసినా ఇంతవరకూ ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేదు.
లేట్ ఎంట్రీ..
అంతర్జాతీయ క్రికెట్లోకి లేటు వయసు (30) లో అరంగేట్రం చేసిన అజాజ్.. 2018లో అబుదాబి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తన తొలి మ్యాచ్‌లోనే ఏకంగా ఏడు వికెట్లు తీసిన అతడు.. శ్రీలంక, ఇండియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ లపై ఆడాడు.ఆడిన అందరు ప్రత్యర్థులపై వికెట్లు పడగొట్టినా స్వదేశంలో మాత్రం అతడింకా ఖాతా తెరవలేదు. వెల్లింగ్టన్, క్రిస్ట్చర్చ్లలో మూడు టెస్టులు ఆడిన అతడు..పేస్ పిచ్‌లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. రాబోయే రోజుల్లో అయినా అజాజ్.. కివీస్ గడ్డమీద వికెట్ తీస్తాడో లేక ఉపఖండపు పిచ్‌లకే వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌గా మిగిలిపోతాడో కాలమే సమాధానం చెప్పాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

