IND vs BAN | టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. సంజూకు మళ్లీ నిరాశే
IND vs BAN : పొట్టి ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియా(India) అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh)తో తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లా సారథి నజ్ముల్ హుసేన్ శాంటో బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs BAN : పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తుకు చేరువైన భారత జట్టు (Team India) మరో విజయంపై కన్నేసింది. అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్ (Bangladesh)తో తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లా సారథి నజ్ముల్ హుసేన్ శాంటో బౌలింగ్ తీసుకున్నాడు.
లో స్కోర్లు నమోదవుతున్న అంటిగ్వా పిచ్‌పై భారత్‌ను తక్కువకే కట్టడి చేయడమే తమ ప్రణాళిక అని శాంటో తెలిపాడు. మరోవైపు రోహిత్ జట్టులో ఏ మార్పులు చేయలేదని చెప్పాడు. దాంతో, చాన్స్ కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్‌కు నిరాశే మిగిలింది.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
బంగ్లాదేశ్ జట్టు : తంజిబ్ హసన్ , లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), షకీబుల్ హసన్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, జకీర్ అలీ, రిషద్ హొసేన్, మహెదీ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ షకీబ్.
సూపర్ 8 దశను విజయంతో ఆరంభించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్ చేరినట్టే. ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసిన రోహిత్ సేనదే పైచేయి సాధిస్తుందా లేదా చూడాలి. అయితే.. టీ20 వరల్డ్ కప్ రికార్డులు టీమిండియా ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఇరుజట్లు 13 సార్లు తలపడగా.. భారత్ డజన్ వియజయాలతో రికార్డు నెలకొల్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

