ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ప్రస్తుతం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తమీమ్.. అఫ్గనిస్థాన్‌తో తొలి వన్డే ఓటమి అనంతరం తన నిర్ణయం ప్రకటించాడు.
మరో మూడు నెలల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 34 ఏండ్ల తమీమ్ రిటైర్మెంట్ బంగ్లా అభిమానులకు షాక్‌నిచ్చింది. ‘ఇది నా ముగింపు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా’ అని తమీమ్ భావోద్వేగానికి గురయ్యాడు.