BAN vs SL: మళ్లీ మునిగిన లంక.. మెగా టోర్నీలో బంగ్లాకు రెండో విజయం
BAN vs SL: ఇటీవలే ఇండియాతో ముగిసిన మ్యాచులో చిత్తుగా ఓడిన లంక.. బంగ్లాతో మ్యాచులో బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది.
BAN vs SL: వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇటీవలే భారత్‌తో ముగిసిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన లంక.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌లో మాత్రం తేలిపోయింది. లంక నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా.. ఏడు వికెట్లు కోల్పోయి మరో తొమ్మిది ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఆ జట్టులో నజ్ముల్ హొసెన్ శాంతో (101 బంతుల్లో 90, 12 ఫోర్లు) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సారథి షకిబ్ అల్ హసన్ (65 బంతుల్లో 82, 12 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి బంగ్లాకు ఎట్టకేలకు ఈ టోర్నీలో రెండో విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. లంకకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఇది ఆరో ఓటమి.
లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. మధుశంక వేసిన మూడో ఓవర్లోనే ఓపెనర్ తాంజిద్ హసన్ (9) వికెట్‌ను కోల్పోయింది. 22 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, రెండు సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేసిన లిటన్ దాస్ కూడా మధుశంక వేసిన ఏడో ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను కెప్టెన్ షకిబ్,శాంతోలు ఆదుకున్నారు.
షకిబ్ – శాంతోలు లంక బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్ ను వారి నుంచి లాగేసుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 149 బంతుల్లో 169 పరుగులు జోడించారు. 49 బంతుల్లో శాంతో అర్థ సెంచరీ పూర్తవగా షకిబ్.. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. రజిత వేసిన 30వ ఓవర్లో 6, 4, 4 బాది 80లలోకి వచ్చాడు. కానీ మాథ్యూస్ వేసిన 32వ ఓవర్లో షకిబ్.. అసలంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మాథ్యూస్ తన మరుసటి ఓవర్లో శాంతోను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. మధుశంక వేసిన 38వ ఓవర్లో వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్ (10) బౌల్డ్ అయ్యాడు.
ఈ టోర్నీలో నిలకడగా ఆడుతున్న మహ్మదుల్లా (22).. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. చమీర వేసిన 37వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతడు తీక్షణ వేసిన 39వ ఓవర్లో మూడో బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆఖర్లో తౌహిద్ హృదయ్ (15 నాటౌట్)లాంఛనాన్ని పూర్తిచేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

