BAN vs AFG | మెహిదీ హసన్ ఆల్ రౌండ్ పవర్.. అఫ్ఘానిస్థాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
BAN vs AFG | క్రికెట్ వరల్డ్ కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఘన విజయం సాధించింది. మెహదీ హసన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో మరో 15.2 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో అఫ్ఘాన్‌ను చిత్తుచేసింది.
న్యూఢిల్లీ: క్రికెట్ వరల్డ్ కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఘన విజయం సాధించింది. మెహదీ హసన్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో మరో 15.2 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో అఫ్ఘాన్‌ను చిత్తుచేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లు కూడా నిలబడలేకపోయింది. కేవలం 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అఫ్ఘాన్ బ్యాటర్లలో వికెట్ కీపర్ రహమానుల్లా గుర్బాజ్ ఒక్కడే 47 పరుగులు చేసి రాణించాడు.
గుర్బాజ్ మినహా ఇబ్రహీమ్ జడ్రాన్ (22), అజ్మతుల్లా ఒమర్జాయ్ (22), రహ్మత్ షా (18), కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇక మిగతా బ్యాట్స్‌మన్ ఎవరూ సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 3, షకీబ్ అల్ హసన్ 3, సోరిఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మరో 15.2 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే 34.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 158/4 స్కోర్‌తో లక్ష్యాన్ని చేధించింది.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్లు తన్జీద్ హసన్, లిట్టన్ దాస్ విఫలమైనప్పటికీ మెహదీ హసన్ (57), నజ్ముల్ హొస్సేన్ శాంటో (59) నిలకడగా ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. అఫ్ఘాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫరూఖీ రెండు వికెట్లు తీశాడు. నవీన్ ఉల్ హక్, మహ్మద్ నబీలకు చెరో వికెట్ దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

