ధ్యానం కోసం స్మార్ట్‌రింగ్
- ఎంపీ సంతోష్‌కుమార్‌కు అందజేసిన గోపీచంద్

హైదరాబాద్, ఆట ప్రతినిధి: టోక్యో విశ్వక్రీడల్లో పాల్గొననున్న అథ్లెట్లకు భారత ఒలింపిక్స్ సంఘం (ఐవోఏ) ధ్యానం నాణ్యతను కొలిచే స్మార్ట్రింగ్లను అందించనుంది. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మెడిటేషన్ ట్రాకింగ్ స్టార్టప్ ధ్యాన ఎండీ భైరవ్ శంకర్ కలిసి ఈ ధ్యాన రింగ్‌కు రూపకల్పన చేశారు. అథ్లెట్లకు ఈ స్మార్ట్రింగ్లను అందించేందుకు ధ్యానతో ఐవోఏ ఒప్పందం చేసుకుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఒత్తిడి జయించేలా ఏకాగ్రతను పెంచుకోవడంలోఈ రింగ్స్ సహాయపడతాయని ఐవోఏ తెలిపింది. అందుకే అథ్లెట్లతో పాటు కోచ్‌లకు కూడా వీటిని అందిస్తామని ప్రకటించింది. ధ్యానంలో ఎంతసేపు ఏకాగ్రతగా ఉన్నామన్న వివరాలను ఈ స్మార్ట్ రింగ్ తెలియజేస్తుంది. ఈ స్మార్ట్ రింగ్‌ను రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌కు గోపీచంద్, భైరవ్ శంకర్ సోమవారం అందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

