Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) వన్డేల్లో జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. వన్డే సిరీస్‌లో అఫ్గనిస్థాన్‌ను వైట్‌వాష్ చేసిన బాబర్ సేన ఆసియా కప్(Asia Cup 2023)లో అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు పాక్ కెప్టెన్ కొత్త స్నేహితుడిని అందరికీ పరిచయం చేశాడు. ఇంతకు ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఒక పిల్లి(Cat). అవును పెంపుడు జంతువుల్ని ఎంతో ఇష్టపడే బాబర్ అనే పిల్లిని తెచ్చుకున్నాడు.
ఆ ఫొటోల్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దానికి ‘నిన్ననే ఒక కొత్త స్నేహితుడిని చేసుకున్నా’ అని క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ చూసిన బాబర్ అభిమానులు పిల్లి ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
శ్రీలంక గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో పాక్ అదరగొట్టింది. హ్యాట్రిక్ విజయాలతో అఫ్గనిస్థాన్‌ను వైట్‌వాష్ చేసి సిరీస్ దక్కించుకుంది. ఆసియా కప్ ముందు పాక్‌కు ఇది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనుంది. ఈసారి హైబ్రిడ్ మోడల్లో జరుగనున్న ఆసియా కప్ ఆగస్టు 30న షురూ కానుంది. సెప్టెంబర్ 2న భారత్, పాక్ తలపడనున్నాయి.