Babar Azam | విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్ కెప్టెన్.. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్
Babar Azam | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న అసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు.
కొలంబో: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న అసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బద్దలు కొట్టాడు. పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా బుధవారం పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య ‘ఆసియా కప్ – 2023’ టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్‌ను పాక్ చిత్తు చేసింది.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. బాబర్‌కు ఇది వన్డే కెరీర్లో 19వ వన్డే సెంచరీ. సెంచరీతో చెలరేగిన బాబర్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లీ అత్యధిక స్కోర్ 136 కాగా, ఇప్పుడు బాబర్ ఆజమ్ 151 పరుగులు చేశాడు.
అంతేగాక వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా బాబర్ ఆజమ్ రికార్డు నెలకొల్పాడు. బాబర్ ఈ ఫీట్‌ను 102 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా 104 ఇన్నింగ్స్‌ల్లో 19 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా మరో ఇద్దరిని బాబర్ అధిగమించాడు.
భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ వన్డేల్లో 5,238 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ 5,346 పరుగులు సాధించాడు. తాజా సెంచరీతో బాబర్ ఆజమ్ ఆ ఇద్దరిని దాటేశాడు. ఇప్పటివరకు 102 వన్డే ఇన్నింగ్స్‌లో బాబర్ 5,353 పరుగులు చేశాడు. ఈ విధంగా ఒక్క మ్యాచ్‌తో బాబర్ మూడు రికార్డులు బద్దలు కొట్టినట్లయ్యింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

