కొలంబో: ఆసియాకప్ సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. ఫైనల్‌కు అందుబాటులో లేకుండాపోయాడు. దీంతో అతడికి బ్యాకప్‌గా మరో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు.
బంగ్లాతో పోరులో అక్షర్ చిటికెన వేలు, మోచేతికి గాయాలయ్యాయి. దీంతో పాటు తొడ కండరాలు కూడా పట్టేయడంతో ముందు జాగ్రత్త చర్యగా సుందర్‌ను పిలిపించామని బీసీసీఐ అధికారి తెలిపారు. ‘అక్షర్ పటేల్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే సుందర్‌ను పిలిపించాం’ అని ఆయన వెల్లడించాడు.