సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఈ వారం పాకిస్థాన్‌తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్న వార్నర్.. వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం సిడ్నీలో నిర్వహించిన ప్రెస్మీట్లో తన కెరీర్‌లోని ఎత్తుపల్లాల గురించి వార్నర్ మాట్లాడాడు. ‘కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చా. చాలా అడ్డంకులు ఎదురయ్యాయి.
వాటిని అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించా. ఆస్ట్రేలియా క్రికెట్‌ను మరింత ఉన్నత స్థితికి చేర్చేందుకు నా వంతు కృషి చేశా. కెప్టెన్సీ బ్యాన్‌తో కాస్త ఇబ్బంది పడ్డా.. ఐపీఎల్ జట్లకు నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా’అని 37 ఏండ్ల వార్నర్ పేర్కొన్నాడు.