Australian Open | పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్.. టైటిల్ పోరులో సిట్సిపాస్‌తో అమీతుమీ
నొవాక్ జకోవిచ్ పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో టామి పౌల్‌ను 7-5, 6-1, 6-2తో చిత్తు చేశాడు. టైటిల్ పోరులో సిట్సిపాస్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు.
Australian Open : మాజీ వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. మెల్బోర్న్ పార్క్‌లోని లార్డ్ లావెర్ అరెనాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టామి పౌల్ (అమెరికా)ను చిత్తు చేశాడు. రెండు గంటల 20 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 7-5, 6-1, 6-2తో ఓడించాడు. మెల్బోర్న్ పార్కులో జకోవిచ్‌కు ఇది వరుసగా 26వ విజయం. దాంతో, పదోసారి ఈ టోర్నీ ఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. టైటిల్ పోరులో స్టెఫనోస్ సిట్సిపాస్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. స్టెఫానో.. రెండు రోజుల్లో నిన్ను కలుస్తాను అని మ్యాచ్ అనంతరం జకోవిచ్ అన్నాడు. 22వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న జకోవిచ్ నాదల్ రికార్డును సమం చేసేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ సెర్బియా స్టార్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరడం ఇది 33వ సారి.
కరోనా వ్యాక్సిన్ వివాదం కారణంగా పోయిన ఏడాగి జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. అయితే.. ఆ సమయం తన శరీరాన్ని, ఆటను మెరుగుపరుచుకునేందుకు ఎంతో సాయపడిందని అతను వెల్లడించాడు. పునరాగమనం తర్వాత అతనికి ఎదురే లేకుండా పోయింది. వరుస విజయాలు సాధించిన జకోవిచ్ ఊహించినట్టుగానే ఫైనల్ చేరాడు. ఈ టోర్నీలో జకోవిచ్‌కు గట్టి పోటీనిచ్చే ఆటగాళ్లు కరువయ్యారు. వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ గాయంతో టోర్నీ నుంచి ముందుగానే తప్పుకున్నాడు. రెండో సీడ్ రఫెల్ నాదల్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. అమెరికా ఆటగాడు మెక్డొనాల్డో చేతిలో స్పెయిన్ బుల్ పరాజయం చెందాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

