ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రాడ్ మార్ష్ కన్నుమూత
Rod Marsh | ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (Rod Marsh) కన్నుమూశారు. ఆసీస్ తరఫున టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుల్లోకెక్కిన ఆయన... గుండెపోటుతో మరణించారు.
అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (Rod Marsh) కన్నుమూశారు. ఆసీస్ తరఫున టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుల్లోకెక్కిన ఆయన… గుండెపోటుతో మరణించారు. గతవారం ఓ చారిటీ మ్యాచ్ సందర్భంగా 74 ఏండ్ల మార్ష్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో అప్పటినుంచి అడిలైడ్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

1970లో ఆస్ట్రేలియా తరఫున మొదటి మ్యాచ్ మార్ష్.. 1984లో రిటైర్ అయ్యారు. మొత్తం 96 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆయన 355 వికెట్ల భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పాడు. అందులో 95 లెజెండరీ పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీబౌలింగ్లోనే కావడం విశేషం. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన వికెట్‌కీపర్ గానూ గుర్తింపు పొందారు.
We are deeply saddened by the passing of Rod Marsh.
A brilliant wicketkeeper and hard-hitting batter, Rod's contribution to Australian cricket was outstanding and he will be truly missed.
Our thoughts are with his wife Ros, children Paul, Dan and Jamie and his many friends. pic.twitter.com/DXR0rEyZjx
— Cricket Australia (@CricketAus) March 4, 2022
రిటైర్మెంట్ అనంతరం క్రెకెట్తో అనుబంధాన్ని కొనసాగించారు. ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీ చీఫ్‌గా రికీపాంటింగ్, జస్టిన్ లాంగర్ వంటి డజన్ల కొద్ది టెస్ట్ ప్లేయర్లను సీనియర్ జట్టుకు అందించారు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. 1985లో స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కించుకున్నారు. కాగా, మార్ష్‌తో తనకున్న అనుబంధాన్ని జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ గుర్తుచేసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టుతోపాటు ప్రత్యర్థి టీంలోని ఆటగాళ్లు కూడా మార్ష్‌ను గౌరవించేవారని చెప్పారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

